Water Supply Project: రూ.8,500 కోట్లతో ఇంటింటికీ కుళాయి
ABN , Publish Date - May 16 , 2025 | 05:22 AM
రూ.8,500 కోట్లతో అమృత్ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి అందించనున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు రూరల్‌లో 339 అభివృద్ధి పనులను ప్రారంభించారు.
నెల్లూరులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి నారాయణ
నెల్లూరురూరల్, మే 15 (ఆంధ్రజ్యోతి): అమృత్ పథకం ద్వారా రూ.8,500 కోట్ల ఖర్చు చేసి రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి అందించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. గురువారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో రూ. 41 కోట్లతో 60 రోజుల్లో నిర్మించిన 339 అభివృద్ధి పనులను ఏకకాలంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం, మంత్రి నారాయణ మాట్లాడుతూ ఎంఎ్‌సఎంఈ పార్కుల అభివృద్ధితో రాష్ట్రానికి పరిశ్రమలు విరివిగా వస్తున్నాయని, ఫలితంగా యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. త్వరలో సీఎ్‌ఫఎంఎ్‌సలో గ్రీన్ చానల్ ద్వారా మున్సిపాలిటీల్లోని నిధులు ఎక్కడికక్కడే ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మేయర్ స్రవంతి, నాయకులు గిరిధర్‌రెడ్డి, మాజీ మేయర్ భానుశ్రీ పాల్గొన్నారు.