ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

British Jet Grounded In Kerala: ఎట్టకేలకు నింగిలోకి బ్రిటన్‌ ఫైటర్‌ జెట్‌ ఎఫ్‌ 35బీ

ABN, Publish Date - Jul 23 , 2025 | 04:08 AM

సోషల్‌ మీడియాలో కడుపుబ్బనవ్వించే మీమ్స్‌కు, కామెంట్లకు దారితీసిన బ్రిటీష్‌ యుద్ధ విమానం

తిరువనంతపురం, జూలై 22: సోషల్‌ మీడియాలో కడుపుబ్బనవ్వించే మీమ్స్‌కు, కామెంట్లకు దారితీసిన బ్రిటీష్‌ యుద్ధ విమానం ఎఫ్‌-35బీ దాదాపు 5 వారాల తర్వాత నింగిలోకి ఎగిరింది. గత నెలలో జరిగిన భారత్‌-బ్రిటన్‌ నేవీ విన్యాసాల్లో పాల్గొన్న ఎఫ్‌-35బీ విమానానికి అకస్మాత్తుగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ విమానాన్ని జూన్‌ 14న అర్ధరాత్రి కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపేశారు. అప్పటి నుంచి ఆ విమానం అక్కడే ఉంది. దీనిలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని గుర్తించడంలోనే నిపుణులు ప్రయాస పడ్డారు. ఈ నెల 6న 14 మందితో కూడిన బ్రిటన్‌ ఇంజనీరింగ్‌ నిపుణుల బృందం.. రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో ఎఫ్‌-35బీని పరిశీలించి.. సాంకేతిక సమస్యలను గుర్తించింది. అనంతరం.. భారత వైమానిక నిపుణుల బృందంతో కలిసి.. ఇంజన్‌లో తలెత్తిన సమస్యను పరిష్కరించింది. కాగా, 5 వారాలకు పైగా తిరువనంతపురం విమానాశ్రయంలో ఉన్న ఎఫ్‌-35బీ యుద్ధ విమానానికి ల్యాండింగ్‌ చార్జీలు, రోజువారీ అద్దె, పార్కింగ్‌ ఫీజుల రూపంలో రూ.5-6 లక్షలు వసూలు చేసినట్టు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 04:08 AM