Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో స్కై స్ట్రైకర్స్ కీలకం
ABN, Publish Date - May 08 , 2025 | 05:09 PM
Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. దీంతో పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదులే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో స్కై స్ట్రైకర్స్ కీలకంగా వ్యవహరించాయి.
న్యూఢిల్లీ, మే 08: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ప్రతీకార చర్యలు పేరుతో ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ సిందూర్‌లో వినియోగించిన ఆత్మాహుతి ద్రోణులు.. స్కై స్ట్రైకర్స్ అత్యంత కీలక పాత్ర పోషించాయి. వీటిని బెంగళూరులో తయారు చేశారు. పశ్చిమ బెంగళూరులోని అల్ఫా డిజైన్ టెక్నాలజీతోపాటు ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్‌బిట్ సిస్టమ్స్ సంస్థలు వీటిని సంయుక్తంగా రూపొందించాయి. ఇవి ఏ సమయంలోనైనా అత్యవసరం అవుతాయని భారత సైన్యం భావించింది. అందులోభాగంగా 2021లో 100 స్కై స్ట్రైకర్స్‌ను తయారు చేయాలంటూ ఈ సంస్థకు ఆర్డర్ ఇచ్చింది. గతంలో బాలాకోట్‌లో సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా వీటిని తయారు చేయాలని భారత్ సైన్యం భావించింది.ఆ క్రమంలో ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది.
ఒకొక్క స్కై స్ట్రైకర్ ద్రోణి.. 5 కేజీలు లేదా 10 కేజీల బరువు ఉంటుంది. దీని పరిధి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. తక్కువ ఎత్తులో సైతం ఈ ద్రోణులు పని చేస్తాయి. అయితే స్కై స్ట్రైకర్ తయారీ చాలా ఖర్చుతో కూడుకున్నది. భవిష్యత్తులో వీటిని వినియోగించే ఆస్కారం అధికంగా ఉంటుందనే అభిప్రాయం సైనిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. లక్ష్యాలను ఛేదించడంలో.. సైనిక బలగాలకు పరిస్థితులపై అవగాహన కల్పించడంతోపాటు ఖచ్చితత్వాన్ని సైతం స్కై స్ట్రైకర్స్ మెరుగుపరుచనున్నాయి. మరి ముఖ్యంగా ప్రత్యేక భద్రతా దళాల కార్యకలాపాలు వీటిని వినియోగించనున్నాయి. సైనికులు లేకుండానే అత్యున్నత స్థాయిలోని లక్ష్యాలను సైతం ఇవి ఛేదించేందుకు ఉపకరిస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: ఈ పాపకు ఆ తల్లిదండ్రులు ఏం పేరు పెట్టారో తెలుసా..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన పహల్గాం మృతుడి భార్య
For National News And Telugu News
Updated Date - May 08 , 2025 | 05:09 PM