Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ
ABN, Publish Date - Apr 23 , 2025 | 10:47 AM
Pahalgam Attack: జమ్మూ కశ్మీర్‌లో ముష్కరులు జరిపిన మారణకాండలో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ వ్యక్తిని కాల్చి చంపే సమయంలో భార్యతో ఉగ్రవాదులు అన్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
జమ్ముకశ్మీర్, ఏప్రిల్ 23: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. మినీ స్విర్జర్లాండ్‌గా పేరొందిన బైసారన్ ప్రాంతంలో పర్యటకులపై ఉగ్రవాదులు విచక్షణమరిచి కాల్పులు జరిపారు. అంత వరకు ప్రకృతి అందాలను చూస్తూ పరవశించిపోతున్న పర్యాటకులకు ఒక్కసారిగా కాల్పులు వినిపించిడంతో ఉలిక్కిపడ్డారు. వారి నుంచి తప్పించుకుందామని అనుకున్నా కూడా వారికి అవకాశం ఇవ్వకుండా వెంబడించి మరీ కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో దాదాపు 27 మంది పర్యటకులు మరణించారు. ఈ ఘటన యావత్ భారతదేశం ఉలిక్కిపడేలా చేసింది. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌బాగ్ జిల్లాలోని పహల్గాంలో నిన్న (మంగళవారం) పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. పెద్ద సంఖ్యలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు.
వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఉగ్రవాదుల దాడికి సంబంధించి ఓ మహిళ చెబుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. భర్త, పిల్లలతో కలిసి సరదాగా కశ్మీర్‌కు వచ్చిన ఆ మహిళకు పెను విషాదమే మిగిలింది. కళ్లెదుటే భర్తను ముష్కరులు అంతమొందిస్తున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఉగ్రవాదుల దాడిలో కట్టుకున్న భర్త ప్రాణాలు కోల్పోగా.. తన కుమారుడితో కలిసి ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. అయితే భర్తను చంపుతున్న సమయంలో ఉగ్రవాది సదరు మహిళతో చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
మహిళ చెప్పిన వ్యాఖ్యలు ఇవీ
కర్ణాటక రాష్ట్రం శివమొగ్గకు చెందిన మంజునాథ్ (47) కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పాయారు. అయితే కాల్పులకు సంబంధించి.. ఆ భయానక పరిస్థితులపై మంజునాథ్ భార్య మీడియాకు చెప్పి ఆవేదన చెందారు. సెలవులు రావడంతో మంజునాథ్, తన భార్య, కుమారుడితో కలిసి కశ్మీర్‌కు వెళ్లాడు. బైసారన్ ప్రాంతంలో పర్యాటక అందాలు చూస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉగ్రవాదులు వీరిని అడ్డగించి మంజునాథ్‌పై కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కానీ మంజునాథ్ భార్య, కొడుకును మాత్రం ఉగ్రవాదులు విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులు తనకు చెప్పిన విషయాలను మీడియాకు తెలియజేశారు మహిళ.
Kadiri Municipal: కదిరి మున్సిపాల్ చైర్ పర్సన్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం
‘నేను, నా భర్త, కుమారుడు కలిసి కశ్మీర్‌కు వెళ్లాము. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో పహల్గామ్‌లో ఉన్న సమయంలో ఉగ్రవాదులు దాడి చేశారు. నా భర్త నా కళ్ల ముందే మరణించాడు. ముగ్గురు, నలుగురు వ్యక్తులు మాపై దాడి చేశారు. నన్ను కూడా చంపండి అని వారిని వేడుకున్నా. కానీ నేను చంపను.. వెళ్లి ఇక్కడ జరిగింది మోడీకి చెప్పు అని వాళ్లలో ఒకరు అన్నారు’ అంటూ మంజునాథ్ భార్య పల్లవి కన్నీటిపర్యంతమయ్యారు. దాడి అనంతరం గాయపడిన వారికి సహాయం చేసేందుకు స్థానిక పౌరులు ముందుకు వచ్చారని తెలిపారు. అలాగే వెంటనే అధికారులు కూడా అక్కడకు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని రక్షించేందుకు ప్రజలు తమ గుర్రాలపై దాడి జరిగిన ప్రాంతం నుంచి బాధితులను తరలించారని సదరు మహిళ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: కాల్పులు జరిపిన ఉగ్రవాది ఫొటో విడుదల
Pahalgam Terror Attack: జస్ట్..పెళ్లయిన ఐదు రోజులకే..
Read Latest National News and Telugu News
Updated Date - Apr 23 , 2025 | 11:03 AM