ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tension in Dharmasthala: దర్మస్థళలో ఉద్రిక్తత.. రిపోర్టర్‌పై దాడి

ABN, Publish Date - Aug 07 , 2025 | 04:20 AM

ధర్మస్థళ సమీపంలోని ఉజిరే వద్ద సువర్ణ చానల్‌ రిపోర్టర్‌తో పాటు ముగ్గురు యూట్యూబర్‌లపై స్థానికులు

బెంగళూరు, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ధర్మస్థళ సమీపంలోని ఉజిరే వద్ద సువర్ణ చానల్‌ రిపోర్టర్‌తో పాటు ముగ్గురు యూట్యూబర్‌లపై స్థానికులు బుధవారం దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ధర్మస్థళలో 2012లో అనుమానాస్పదంగా మృతి చెందిన సౌజన్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బిగ్‌బాస్‌ ఫేం రజత్‌ వ చ్చారు. నేత్రావతి నది సమీపంలో ఆయన యూట్యూబర్లతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతుండగానే 50 నుంచి 60 మంది స్థానికులు అక్కడికి చేరుకుని సువర్ణ చానల్‌ రిపోర్టర్‌తో పాటు యూట్యూబర్‌లతో వాగ్వాదానికి దిగారు. సౌజన్య అనుమానాస్పద మృతిపై పోరాడుతున్న మహేశ్‌ శెట్టి తిమరోడి, గిరీశ్‌ మట్టన్నతో పాటు వారి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగి.. నలుగురినీ చితకబాదారు. అంతలోనే యూట్యూబర్లకు మద్దతుగా వంద మందికిపైగా యువకులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలూ ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నాయి. గొడవ అంతకంతకూ పెరుగుతుండటంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఊటీలో పర్యాటక ప్రాంతాల మూసివేత.. కారణం ఏంటంటే..

అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 04:20 AM