Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్
ABN, Publish Date - May 11 , 2025 | 06:23 PM
పాక్ ఉల్లంఘనలకు పాల్పడితే కౌంటర్ ఆటాక్ ఇచ్చేందుకు వెస్ట్రన్ బోర్డర్స్‌లోని ఆర్మీ కమాండర్లకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పూర్తి అధికారులు ఇచ్చారు. పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించడంపై ఆర్మీ కమాండర్లతో ద్వివేది సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
న్యూఢిల్లీ: భారత్‌తో కాల్పుల విరమణకు అంగీకరించిన కొద్ది గంటల్లోనూ పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలోకి తొక్కడాన్ని ఇండియన్ ఆర్మీ సీరియస్‌గా తీసుకుంది. ఇరు దేశాల డీజీఎంఓల మధ్య కుదిరిన ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తే కౌంటర్ చర్యలు తప్పవని హెచ్చరిక సందేశాలిచ్చింది. పాక్ ఉల్లంఘనలకు పాల్పడితే కౌంటర్ ఆటాక్ ఇచ్చేందుకు వెస్ట్రన్ బోర్డర్స్‌లోని ఆర్మీ కమాండర్లకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పూర్తి అధికారులు ఇచ్చారు. పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించడంపై ఆర్మీ కమాండర్లతో ద్వివేది సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణను శనివారం ప్రకటించారు. ఆ వెంటనే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సాయంత్రం 5 గంటలను నుంచి కాల్పులు విరమణను ఇరు దేశాలు పాటిస్తున్నాయంటూ కీలక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన చేసిన కొన్ని గంటలకే పాకిస్థాన్ తన తెంపరితనాన్ని మరోసారి చాటింది. భారత్ సరిహద్దుల వెంబడి డ్రోన్‌లతో దాడికి దిగింది. పలు చోట్ల కాల్పులకు తెగబడింది. వీటిని భారత్ సైన్యం సమర్ధంతంగా తిప్పికొట్టింది.
ఏప్రిల్ 22న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలో విరుచుకుపడి 26 మంది టూరిస్టులను అత్యంత పాశవికంగా కాల్చిచంపడంపై భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇందుకు ప్రతిచర్యగా 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి భారత బలగాలు చొచ్చుకెళ్లి 26 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. రాడార్ ఇన్‌స్టలేషన్స్, కమాండ్, కంట్రోల్ సెంటర్లు, ఆయుధ గిడ్డంగులపై శతఘ్నల వర్షం కురిసింది.
ఇవి కూడా చదవండి:
కశ్మీర్ సమస్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 11 , 2025 | 07:02 PM