Operation Sindoor: భారత్ వ్యూహాత్మక సత్తాను ఆపరేషన్ సిందూర్ చాటింది: అమిత్‌షా
ABN, Publish Date - May 16 , 2025 | 05:11 PM
న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో కొత్త మల్టీ-ఏజెన్సీ సెంటర్ను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ వ్యూహాత్మక్మ వృద్ధి, నిర్వహణ సామర్థ్యాలకు 'ఆపరేషన్ సిందూర్' ఓ ఉదాహరణ అని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ: జాతీయ భద్రత, ఇంటెలిజెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పటిష్టతకు భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో కొత్త మల్టీ-ఏజెన్సీ సెంటర్ (MAC)ను శుక్రవారం నాడు అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యూహాత్మక్మ వృద్ధి, నిర్వహణ సామర్థ్యాలకు 'ఆపరేషన్ సిందూర్' (Operaiton Sindoor) ఒక ఉదాహరణనని చెప్పారు. ఈ ఆపరేషన్ విజయవంతానికి ప్రధానమంత్రి మోదీ దృఢ సంకల్పం, కచ్చితమైన, సకాలంలో అందిన ఇంటెలిజెన్స్ సమాచారం, భారత సాయుధ బలగాల సత్తా కారణాలని ప్రశంసించారు.
Rajnath Singh: పాక్‌కు రుణం ఇవ్వడంపై ఐఎంఎఫ్ పున:పరిశీలించాలి: కేంద్రమంత్రి..
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఆధ్యర్యంలో కొత్తగా ప్రారంభించిన మల్టీ ఏజెన్సీ సెంటర్ (ఎంఏసీ) పనిచేస్తుంది. దేశవ్యాపంగా ఉన్న వివిధ భద్రతా సంస్థలు, నిఘా ఏజెన్సీల మధ్య సమచార మార్పిడి, సమన్వయానికి ఎంఏసీ కృషి చేస్తుంది. అంతర్గత, బహిర్గత ముప్పును అంచనా వేసి, ఆ ముప్పును నివారించేందుకు అవసరమైన రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్, సత్వర స్పందన మెకానిజం, ఇంటర్-ఏజెన్సీ సినర్జీ మెరుగుపరిచేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు.
'ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్'లో గాయపడిన వారి పరామర్శ..
దీనికి ముందు, ఇటీవల ముగిసిన నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్.. 'ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్'లో గాయపడిన ఐదుగురు భద్రతా సిబ్బందిని అమిత్‌షా పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స, క్షేమ సమాచారాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ట్రౌమా సెంటర్‌లో వీరు చికిత్స పొందుతున్నారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కరెగుట్ట హిల్స్‌లో బలగాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి. మావోయిస్టులపై జరిగిన ఈ అతిపెద్ద ఆపరేషన్ 21 రోజులపాటు సాగింది. పలువురు వాంటెడ్ కమాండర్స్‌తో సహా 31 మంది టాప్ నక్సలైట్లను ఈ ఆపరేషన్‌లో బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్‌లో అసిస్టెంట్ కమాండంట్ సాగర్ బొరాడే (204 కోబ్రా బెటాలియన్), హెడ్ కానిస్టేబుల్ మునీశ్ చంద్ శర్మ (203 కోబ్రా), కానిస్టేబుల్ ధను రామ్ (204 కోబ్రా), కానిస్టేబుల్ కృష్ణ కుమార్ గుర్జర్ (196 సీఆర్‌పీఎఫ్), కానిస్టేబుల్ సంతోశ్ మురమి (డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, ఛత్తీస్‌గఢ్ పోలీస్) ఉన్నారు.
దేశంలో నక్సల్స్ నిర్మూలనకు చేపట్టిన మిషన్‌లో 'ఆపరేషన్ బ్లాక్‌ఫారెస్ట్' సాధించిన విజయం చారిత్రకమని, ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో 2026 మార్చికల్లా దేశంలో నక్సల్స్ నిర్మూలనకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని కేంద్రమంత్రి అమిత్‌షా పునరుద్ఘాటించారు.
ఇవి కూడా చదవండి..
Defence Budget: ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. ఆర్మీకి మరో 50 వేల కోట్ల నిధులు
Indian Army Encounter: పల్వామాలో ఎన్‌కౌంటర్.. 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల హతం..
Updated Date - May 16 , 2025 | 05:40 PM