Share News

Indian Army Encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల హతం..

ABN , Publish Date - May 16 , 2025 | 01:30 PM

జమ్మూ కశ్మీర్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది. నిఘా వర్గాల సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని, 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు ఫోర్స్ మేజర్ జనరల్ ధనంజయ్ జోషి తెలిపారు.

Indian Army Encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల హతం..

ఇంటర్నెట్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది. నిఘావర్గాల సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని, 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు ఫోర్స్ మేజర్ జనరల్ ధనంజయ్ జోషి తెలిపారు. గత మార్చిలో జరిగిన ఓ హత్యలో ఈ ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒకరి ప్రమేయం ఉందని తెలిపారు. వివరాల్లోకి వెళితే..


పుల్వామా పరిధి (Pulwama Encounter) కేలార్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు మే 12న ఇండియన్ ఆర్మీకి (Indian Army) సమచారం అందింది. దీంతో వారిని మట్టుబెట్టేందుకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలో మొదటగా అనుమానిత ప్రాంతంలోని ప్రజలందరినీ ఖాళీ చేయించారు. మరుసటి రోజు ఉదయం ఉగ్రవాదుల కదలికలను గమనించిన సైనికులు కాల్పలు జరిపారు. అయితే ఇందుకు ప్రతిగా ఉగ్రవాదులు (Terrorists) సైతం ఎదురు కాల్పులు చేశారు. అయినా ఇండియన్ ఆర్మీ మరింత దీటుగా కాల్పులు చేసి ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించి మట్టుబెట్టారు.


Terrorists.jpg

అలాగే ట్రాల్‌ ప్రాంతంలో రెండో ఆపరేషన్ జరిగింది. భారత సైన్యం ఆ గ్రామాన్ని చుట్టుముడుతుండగా.. ఉగ్రవాదులు వేర్వేరు ఇళ్లలో మోహరించి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో సైన్యం మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చింది. మృతిచెందిన ఉగ్రవాదులు ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వాని, యావర్ అహ్మద్ భట్‌.. జైష్-ఎ-మొహమ్మద్ సంస్థకు చెందిన వారని ఆర్మీ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులలో ఒకరైన షాహిద్ కుట్టే రెండు ప్రధాన దాడుల్లో పాల్గొన్నాడని పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వదలకుండా మట్టుబెట్టడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.


Also Read:

ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్..ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసా..

టర్కీ నుంచి దిగుమతులు ఆగిపోతే.. వీటి రేట్లు విపరీతంగా పెరుగుతాయి

కశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదు

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 16 , 2025 | 03:08 PM