All Party Delegations: ఏడు ప్రతినిధి బృందాలు.. టీమ్ లీడర్లు వీరే..
ABN, Publish Date - May 17 , 2025 | 02:45 PM
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఎంపీల లిస్ట్ పంపాలంటూ అన్ని పార్టీలను కేంద్రం కోరింది. అనంతరం ప్రతినిధుల బృందం జాబితాలను ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల బండారాన్ని బయటపెట్టేందుకు, ఉగ్రకుట్రల్ని అందరికీ విశదీకరించేందుకు భారత ప్రతినిధులను విదేశాలకు మోదీ సర్కార్ పంపుతోంది. ఇందుకోసం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ టీమ్‌లను లీడ్ చేసే నాయకుల పేర్లను కూడా ప్రకటించింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఎంపీల లిస్ట్ పంపాలంటూ అన్ని పార్టీలను కేంద్రం కోరింది. అనంతరం ప్రతినిధుల బృందం జాబితాను ప్రకటించింది. మే ద్వితీయార్థంలో ఈ టీమ్‌లు విదేశాలకు వెళ్లనున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన క్రమంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది.
Shashi Tharoor: కాంగ్రెస్ వద్దన్నా.. కేంద్రం ఆహ్వానం.. హీట్ పుట్టిస్తున్న శశిథరూర్
కాగా, కేంద్రం ప్రకటించిన ఏడు ప్రతినిధుల బృందాలకు ఏడుగురు పార్లమెంట్ సభ్యులు సారథ్యం వహించనున్నారు. కాంగ్రెస్ నుంచి శశిథరూర్, బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, జేడీయూ నుంచి సంజయ్ కుమార్ ఝా, బీజేపీ నుంచి బైజయంత్ పాండా, డీఎంకే నుంచి కనిమొళి, ఎన్‌సీపీ నుంచి సుప్రిరాయ సూలే, శివసేన నుంచి శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే పేర్లను ప్రకటించారు. అమెరికా ప్రతినిధి బృందానికి శశిథరూర్, రష్యా ప్రతినిధి బృందానికి కనిమొళి, ఆఫ్రికా ప్రతినిధి బృందానికి శ్రీకాంత్ షిండే, గల్ఫ్ దేశాలకు రవి శంకర్ ప్రసాద్ నేతృత్వం వహిస్తారు.
అమెరికా ప్రతినిధి బృందానికి శశిథరూర్ నాయకత్వం వహించనుండగా, టీమ్‌లో శాంభవి చౌదరి, సర్ఫరాజ్ అహ్మద్, సుదీప్ బందోపాధ్యాయ్, హరీష్ బాలయోగి, శశాంక్ మణి ప్రతిపాఠి, భువనేశ్వర్ కలిత, మిలంద్ దేవర ఉన్నారు. వీరితోపాటు అమెరికాకు మాజీ రాయబారి రణ్‌జిత్ సింగ్ సంధు, ఐఓఆర్ డెర్కటర్ వరుణ్ జెఫ్ కూడా ఉన్నారు. ఏడు ప్రతినిధి బృందాలలో నాలుగింటికి అధికార ఎన్డీయే, మూడింటికి విపక్ష ఇండియా కూటమి సారథ్యం వహించనున్నాయి. ఒక్కో డెలిగేషన్ సుమారు ఐదు దేశాల్లో పర్యటిస్తుందని, ప్రతి టీమ్‌తోనూ పలువురు ప్రముఖ దౌత్యవేత్తలు ఉంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి:
Pak PM Shehbaz Sharif: భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
NIA: ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 17 , 2025 | 03:37 PM