Air India Runway Accident: ముంబైలో రన్‌వే పక్కకు ఎయిరిండియా విమానం
ABN, Publish Date - Jul 22 , 2025 | 04:24 AM
ముంబై విమానాశ్రయంలో సోమవారం ఎయిరిండియా విమానం స్వల్ప ప్రమాదానికి గురైంది...
రన్‌వే పక్కకు దూసుకెళ్లిన కోచి విమానం
ముంబై, జూలై 21: ముంబై విమానాశ్రయంలో సోమవారం ఎయిరిండియా విమానం స్వల్ప ప్రమాదానికి గురైంది. కోచి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబై బయలుదేరియన ఎయిరిండియా విమానం.. సోమవారం ఉదయం 9.27 గంటలకు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే.. ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై ఆ విమానం అదుపుతప్పినట్లు ఎన్డీటీవీ ప్రచురించిన దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. విమానం రన్‌వే పక్కకు చొచ్చుకుపోవడంతో.. ఓవైపు వంగిపోయింది. ఈ ఘటనలో రన్‌వే పక్కన ఉండే మూడు సైన్ బోర్డులు, రన్‌వే అంచుల్లో ఉండే నాలుగు లైట్లు దెబ్బతిన్నాయి. విమానంలోని కుడి ఇంజన్ దెబ్బతిన్నది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఎయిరిండియా కూడా స్పందించింది. విమానంలోని ఇద్దరు పైలట్లను విధుల నుంచి తప్పించినట్లు ప్రకటించింది. మరోవైపు, ఎయిరిడియా విమానం సాంకేతిక సమస్య కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు వద్ద టేకా్‌ఫను రద్దు చేసుకున్న ఉదంతం సోమవారం చోటుచేసుకుంది. ఏఐ2403 విమానం ఢిల్లీ నుంచి కోల్‌కతా బయలుదేరడానికి సిద్ధంగా ఉండగా.. పైలట్లు సాంకేతిక లోపాలను గుర్తించారని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. టేకా్‌ఫను రద్దు చేసుకునే సమయంలో విమానం రన్‌వేపై 155 కి.మీ వేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పైలట్లు సాంకేతిక లోపాన్ని గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 22 , 2025 | 04:24 AM