Plane Crash: డాక్టర్ల హాస్టల్‌లోకి దూసుకెళ్లిన విమానం
ABN, Publish Date - Jun 12 , 2025 | 05:05 PM
విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయ సమీపంలో ఉన్న డాక్టర్ల హాస్టల్‌లోకి దూసుకెళ్లి కూలిపోయింది. వెంటనే ఆ ప్రాంతంలోఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ లో ఉన్న 20మంది డాక్టర్లు చనిపోయినట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్‌లోని గాట్విక్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం AI-171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. సిబ్బందితో సహా 242 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం విమానాశ్రయ సమీపంలో ఉన్న డాక్టర్ల హాస్టల్‌లోకి దూసుకెళ్లి కూలిపోయింది. బిల్డింగ్ లో ఉన్న 20మంది డాక్టర్లు చనిపోయినట్టు సమాచారం. ఈ ప్యాసింజర్ విమానం భారత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది.
ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది, ఇతర బృందాలు పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యాయి. ప్రమాదం జరిగిన ఐదు నిమిషాల వ్యవధిలోనే పోలీసులు, ఇతర ఏజెన్సీలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 70 నుంచి 80 శాతం సహాయక చర్యలు పూర్తయినట్టు తెలుస్తోంది. గాయపడ్డ వాళ్లని హాస్పిటల్స్‌కు తరలించారు. కూలిన విమాన కెప్టెన్ సుమీత్ సభర్వాల్‌కు 8,200 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉంది. విమానంలో కో పైలట్ గా ఉన్న క్లైవ్ కుందర్‌కు 1,100 గంటలకు పైగా అనుభవం ఉంది.
విమానం గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే MAYDAY డిస్ట్రెస్ కాల్ జారీ చేశారని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు తెలిపారు. అత్యవసర సిగ్నల్ తర్వాత ఎటువంటి సమాచారం అందలేదన్నారు. కొద్దిసేపటి తర్వాత, విమానం కూలిపోయిందని అధికారులు వివరించారు. వైద్య నిఫుణల నివాస ప్రాంతమైన డాక్టర్ల హాస్టల్ దగ్గర ఈ విమానం కూలగానే మంటలు, నల్లటి దట్టమైన పొగ వ్యాపించింది.
ఇవీ చదవండి:
ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే రాకెట్‌లో వచ్చేస్తుంది!
లాడెన్ పాక్ సైనిక నగరంలో ఎలా ఉండగలిగాడు
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 12 , 2025 | 05:26 PM