ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Air India: ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ రూట్లలో విమాన సర్వీసులు రద్దు

ABN, Publish Date - Jun 20 , 2025 | 12:39 PM

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం కారణంగా ఎయిర్ ఇండియాను సంస్థను సొంతం చేసుకున్న టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది.

Air India Flight

న్యూఢిల్లీ, జూన్ 20: ఎయిర్ ఇండియా సంస్థను సొంతం చేసుకున్న టాటా గ్రూప్ సంస్థ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. పలు అంతర్జాతీయ విమాన సర్వీసులతోపాటు దేశంలో నడిచే వివిధ విమాన సర్వీసులను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అందుకు కారణాలను సైతం ఆ సంస్థ వివరించింది. విమాన సర్వీసుల భద్రత తనిఖీలు, వాతవరణ పరిస్థితులు, ఆకాశ మార్గంలో విధించిన నిబంధనలు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశదీకరించింది.

అహ్మదాబాద్‌ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురి కావడంతో వందలాది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విమానయాన సంస్థను సొంతం చేసుకున్న టాటా సంస్థ.. ఎయిర్ ఇండియా విమానాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. అదీకాక ఇటీవల కాలంలో పలు ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తరచూ ఎదురవుతున్నాయి. దీంతో ఈ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై ఆ సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. అందులోభాగంగా ఈ తనిఖీలను ముమ్మరం చేసింది.

దుబాయ్, చెన్నై, ఢిల్లీ, మెల్‌బోర్న్, పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబయి తదితర మార్గాల్లో ప్రయాణించే అంతర్జాతీయ, జాతీయ విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా సోదాహరణగా వివరించింది.

ఆ జాబితాలో.. ఎయిర్ ఇండియా ఫ్లెయిట్స్..

  • ఏఐ 906 దుబాయ్ నుంచి చెన్నై.

  • ఏఐ 308 ఢిల్లీ నుంచి మెల్ బోర్న్,

  • ఏఐ 309 మెల్ బోర్న్ నుంచి ఢిల్లీ,

  • ఏఐ 2204 దుబాయ్ నుంచి హైదరాబాద్

అలాగే దేశీయంగా..

  • ఏఐ 874 పుణె నుంచి ఢిల్లీ,

  • ఏఐ అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ

  • ఏఐ 2872 హైదరాబాద్ నుంచి ముంబై

  • ఏఐ 571 చెన్నై నుంచి ముంబై సర్వీసులు ఉన్నట్లు తెలిపింది.

ఈ నెంబర్లకు కాల్ చేయండి..

ఇప్పటికే ఈ విమాన సర్వీసులకు టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు నగదు తిరిగి చెల్లిస్తామని విమానయాన సంస్థ ప్రకటించింది. లేకుండా ఉచిత రీ షెడ్యూలింగ్‌ చేస్తామని హామీ ఇచ్చింది. అలా కానీ పక్షంలో ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని భరోసా కల్పించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. అయితే విమానాశ్రయానికి వెళ్లే ముందు విమాన సర్వీసుల పరిస్థితి తెలుసుకోవాలని ప్రయాణికులకు ఈ సందర్భంగా సూచించింది. లేకుంటే కస్టమర్ కేర్ నెంబరులు.. 011 - 69329333 లేకుంటే 011- 69329999 నెంబర్లు కాల్ చేసి వివరాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

తాత్కాలికంగా పలు సర్వీసులు..

ఇక పలు అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా గురువారం వెల్లడించి సంగతి తెలిసిందే. జూన్ 2 నుంచి జులై 15వ తేదీన మధ్య పలు మార్గాల్లో విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా ఎయిర్ ఇండియా సంస్థ వెల్లడించిన విషయం విదితమే. ౌ

ఈ వార్తలు కూడా చదవండి..

ఘోర రోడ్డుప్రమాదం.. తొమ్మిది మంది మృతి

లామ్నుంథెం సింగ్సన్‌కు కడసారి వీడ్కోలు.. భారీగా తరలి వచ్చిన ప్రజలు

For National News And Telugu News

Updated Date - Jun 20 , 2025 | 01:18 PM