ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AIADMK: అన్నాడీఎంకే ఆఫీసులో ప్రేతాత్మ వదంతులు..

ABN, Publish Date - Jun 27 , 2025 | 11:16 AM

స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే(AIADMK) ప్రధాన కార్యాలయం ‘ఎంజీఆర్‌ మాళిగై’లో ప్రేతాత్మ సంచరిస్తున్నట్లు వదంతులు షికార్లు చేస్తున్నాయి. వాటిని నిజమని నమ్మే విధంగా ఐదురోజులుగా ఆ కార్యాలయం వద్ద సాయంత్ర వేళ్లలో ఓ మాంత్రికుడు సంచరిస్తూ శంఖాన్ని ఊదుతూ కనిపిస్తున్నాడు

- శంఖం ఊదిన మాంత్రికుడు

- సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం

చెన్నై: స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే(AIADMK) ప్రధాన కార్యాలయం ‘ఎంజీఆర్‌ మాళిగై’లో ప్రేతాత్మ సంచరిస్తున్నట్లు వదంతులు షికార్లు చేస్తున్నాయి. వాటిని నిజమని నమ్మే విధంగా ఐదురోజులుగా ఆ కార్యాలయం వద్ద సాయంత్ర వేళ్లలో ఓ మాంత్రికుడు సంచరిస్తూ శంఖాన్ని ఊదుతూ కనిపిస్తున్నాడు. ఓ రోజు ఆ మాంత్రికుడు వేకువజామునే ఆ కార్యాలయం వద్దకు రావడంతో కార్యాలయ సిబ్బంది అతడిని నిర్బంధంలోకి తీసుకుని విచారించారు.

ఆ మాంత్రికుడి వివరాలనును కనుగొనేందుకు సిబ్బంది ప్రయత్నించినప్పటికీ బదులివ్వకపోగా ఐదు రోజులుగా సంచరిస్తుంటే ఎందుకు పట్టించుకోలేదంటూ ఎదురు ప్రశ్నించాడు. వారం రోజులుగా తాను శంఖం ఊదుతుంటే నిద్రపోతున్నారా అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా కేరళ(Kerala)కు చెందిన నంబూద్రీలు అన్నాడీఎంకే కార్యాలయం ముందున్న విగ్రహాలను కార్యాలయం వెనుక వైపున ప్రతిష్ఠిస్తే బాగుంటుందని పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం.

కోరికలు తీరని ఓ ఆత్మ ఆ కార్యాలయంలో సంచరిస్తోందని నంబూద్రీలు హెచ్చరించినట్లు కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ విషయం గురించి అన్నాడీఎంకే సీనియర్‌ నేత ఒకరు మాట్లాడుతూ.. ప్రస్తుతం అన్నాడీఎంకేపై జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటి అని వ్యాఖ్యానించడం గమనార్హం.

ఈ వార్తలు కూడా చదవండి.

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 27 , 2025 | 11:16 AM