ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AIADMK: ఎన్నికలకు సిద్ధం కండి.. ఎమ్మెల్యేలకు ఈపీఎస్‌ దిశా నిర్దేశం

ABN, Publish Date - Jun 05 , 2025 | 12:36 PM

మరికొద్ది రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్యేలంతా సిద్ధం కావాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్‌) సూచించారు.

చెన్నై: రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పార్టీని మెజార్టీ సీట్లలో గెలిపించి అధికారంలో కూర్చోబెట్టాలన్న లక్ష్యంతో ఎన్నికలకు సిద్ధంకావాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) పిలుపునిచ్చారు. 2026లోశాసనసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఎంజీఆర్‌ మాలిగైలో బుధవారం ఉదయం ఈపీఎస్‌ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలో ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలు, వాటి పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలు, అన్నాడీఎంకే పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు, పార్టీ ఓటుబ్యాంకు, ఎన్నికల ప్రచారంలో ఏఏ అంశాలు ఉండాలి, బూత్‌ కమిటీల ఏర్పాటు తదితరాల వివరాలను ఈపీఎస్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈపీఎస్‌ మాట్లాడుతూ, జెండా మోస్తున్న కార్యకర్తలే పార్టీకి బలమని, వారిని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కార్యదర్శుల పదవుల్లో ఉన్నవారు ప్రతిరోజు పలకరించి పార్టీ పనులు చేయించుకోవాలని సలహా ఇచ్చారు.


2016 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సాధించిన విజయం అసామాన్యమని, వచ్చే ఏడాదిలోనూ మహా విజయం కోసం ప్రతీ కార్యకర్త సైనికుడిలా ఇప్పటినుండే పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ ప్రిసీడియం చైర్మెన్‌ తమిళ్‌ మగన్‌ హుస్సేన్‌, ప్రధాన నిర్వాహకులు కేపీ మునుస్వామి, దిండుగల్‌ శ్రీనివాసన్‌, పొల్లాచ్చి జయరామన్‌, ఎస్పీ వేలుమణి, డి.జయకుమార్‌, కేఏ సెంగోట్టయ్యన్‌, డాక్టర్‌ విజయ్‌భాస్కర్‌, కడంబూరు రాజు, తంగమణి, సి.పొన్నయ్యన్‌, వలర్మతి, గోకుల ఇందిరా, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ ధనపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


రాజ్యసభకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా సంతకాలు...

రాజ్యసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరుఫున పోటీ చేయనున్న ఐఎస్‌ ఇన్బదురై, ధనపాల్‌లను ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలకు ఈపీఎస్‌ పరిచయం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో రెండాకుల గుర్తుపై పోటీ చేసి గెలిచిన 66 మంది సభ్యులుండగా, వీరిలో నలుగురు ఓపీఎస్‌ వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. వీరిని మినహాయించి మిగతా 62 మంది సభ్యులు రాజ్యసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరుఫున పోటీచేయనున్న ఇన్బదురై, ధనపాల్‌లకు మద్దతు తెలుపుతూ నామినేషన్‌ పత్రాల్లో సంతకాలు చేశారు.



ఈ వార్తలు కూడా చదవండి.

కవితపై కేసీఆర్‌ నారాజ్‌!

ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 05 , 2025 | 12:36 PM