Fire Accident : మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం..
ABN, Publish Date - Jan 30 , 2025 | 03:35 PM
బ్రేకింగ్..ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే భారీ అగ్నిప్రమాదం సంభవించింది..
ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం జరగడం ఇది రెండోసారి. జనవరి 19న తొలి అగ్నిప్రమాదం జరిగింది. తాజాగా, గురువారం సెక్టార్-22 ప్రాంతంలో మంటలు చెలరేగి ఇప్పటికే అనేక టెంట్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. సీనియర్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు చెలరేగిన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలేమిటో ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా, మౌని అమావాస్య సందర్భంగా నిన్న బుధవారం తొక్కిసలాట జరిగింది. ఈ విషాధ ఘటనలో 30 మంది మరణించినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ధృవీకరించింది. వాస్తవానికి 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అనధికారిక సమాచారం. జనవరి 19న జరిగిన కూడా అగ్ని ప్రమాదం జరిగి సుమారు18 టెంట్లు దగ్ధమయ్యాయి. మొత్తంగా మహాకుంభమేళా ప్రారంభైన నాటి నుంచి మూడు అవాంఛనీయ ఘటనలు జరిగాయి. వీటిలో నిన్న జరిగిన తొక్కిసలాటే అత్యంత విషాదకర ఘటన.
Updated Date - Jan 30 , 2025 | 05:05 PM