Pakistan Vs India: మళ్లీ కాళ్ల బేరానికి దిగిన పాక్
ABN, Publish Date - Aug 12 , 2025 | 03:22 PM
జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాంలో ఉగ్ర దాడి కారణంగా భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో పాకిస్థాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌పై పాకిస్థాన్ రోజుకు ఒక రీతిగా వ్యవహరిస్తోంది.
న్యూఢిల్లీ, ఆగస్ట్ 12: జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాంలో ఉగ్ర దాడి కారణంగా భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో పాకిస్థాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌పై పాకిస్థాన్ రోజుకు ఒక విధంగా వ్యవహరిస్తోంది. భారత్‌పై అణు బాంబు వేస్తామంటూ పాకిస్థాన్ సైనిక చీఫ్ అసిమ్ మునీర్ ప్రకటించారు. ఆ మరుసటి రోజే భారత్‌పై యుద్ధానికి దిగుతామంటూ ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో వెల్లడించారు. ఆ మరునాడే అంటే.. ఈ రోజు మంగళవారం సింధు జలాలను పునరుద్ధరించాలని భారత్‌ను పాకిస్థాన్ కోరింది.
ఈ నదీ జలాల విషయంలో కోర్టు ఆర్బిట్రేషన్ వివరణను తాము స్వాగతిస్తామని పాక్ స్పష్టం చేసింది. ఈ ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. సింధు జలాల ఒప్పందాన్ని అనుసరించి.. ఈ నదీ జలాలను వెంటనే పునరుద్ధరించాలని భారత్‌ను కోరింది. ఈ ఒప్పందంలో భాగంగా చేసుకున్న హామీలను నమ్మకంగా అమలు చేయాలని భారత్‌ను కోరింది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంగళవారం తన ఎక్స్ ఖాతా వేదికగా భారత్‌కు కోరింది.
శతాబ్దాల క్రితం చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంపై పాక్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో సోమవారం స్పందించారు. భారత్ నిర్ణయం కారణంగా పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈ నేపథ్యంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పాకిస్థానీయులంతా ఒక తాటిపైకి రావాలంటూ పిలుపు నిచ్చారు. ఈ పిలుపు ఇచ్చిన మరునాడే.. సింధు జలాలను విడుదల చేయాలంటూ భారత్‌ను పాకిస్థాన్ ప్రాధేయపడింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
పెహల్గాం ఉగ్రదాడి వెనుక కర్త, కర్మ, క్రియ అంతా పాకిస్థాన్ అని భారత్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 1960లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య చేసుకున్న సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది. అలాగే పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇక పాక్ సైతం భారత్‌కు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకున్నాయి. అయితే సింధు జలాలను భారత్ నిలిపివేసింది. దాంతో పాకిస్థాన్‌లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది.
అందులో భాగంగా నీటిని విడుదల చేయాలంటూ పాకిస్థాన్ కోరినా.. భారత్ మాత్రం కనికరించలేదు. అలాంటి వేళ.. ఈ నదీ జలాలపై భారత్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. కోర్టు ఆర్బిట్రేషన్‌ను పాకిస్థాన్ ఆశ్రయించింది. కోర్టు ఆర్బట్రేషన్ ఇచ్చిన తీర్పును తాము తిరస్కరిస్తున్నామని భారత్ స్పష్టం చేసింది. ఈ కోర్టు ఆర్బిట్రేషన్ ఆదేశాలను తాము పరిగణలోకి తీసుకోవడం లేదని పాకిస్థాన్‌కు భారత్ కుండ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సింధు జలాల ఒప్పందంలో భాగంగా బియాస్, సట్లేజ్, రావి నదులపై భారత్‌కు హక్కులుంటే.. ఇండస్, జీలం, చీనాబ్ నదులపై పాకిస్థాన్ హక్కులను కలిగి ఉన్న విషయం విదితమే.
ఇవి కూడా చదవండి..
జస్టిస్ వర్మ నోట్ల కట్టల ఉదంతం కీలక మలుపు.. అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన లోక్‌సభ స్పీకర్
తిక్క రేగిందంటే బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపిస్తాం.. బిలావల్‌కు మిథున్ చక్రవర్తి వార్నింగ్
For More National News and Telugu News
Updated Date - Aug 12 , 2025 | 05:37 PM