ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: సినిమా అప్పుడే అయిపోలేదు.. ఆర్మీ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - May 07 , 2025 | 03:06 PM

పాక్ ఉగ్రవాదుల పీచమణించేందుకు 'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత్ చేపట్టిన ఆపరేషన్‌పై భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే కీలకమైన హింట్ ఇచ్చారు.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడి 100 మంది వరకూ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఏకకాలంలో 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌పై భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే Manoj Naravane) కీలకమైన హింట్ ఇచ్చారు. ''సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది'' (Abhi picture baki hai) అంటూ సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ చేశారు. దీంతో పాక్ ఉగ్రవాదులపై మరిన్ని చర్యలు భారత ఆర్మీ ప్లానింగ్‌లో ఉన్నాయని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి పట్టుకునే దిశగా పావులు కదపవచ్చని నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు.

Operation Sindoor: ఇది గర్వించే సమయం... ఆపరేషన్‌ సిందూర్‌పై మోదీ


దీనికి ముందు భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో భారత బలగాలు 'ఆపరేషన్ సింధూర్' నిర్వహించినట్టు ప్రకటించింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై దాడులు జరిపి ఎక్కడి నుంచైతే ఉగ్రవాదులు భారత్‌పై కాల్పులకు దిగుతున్నారో ఆ ప్రాంతాలను, అక్కడి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నేలమట్టం చేసినట్టు తెలిపింది. తొమ్మిది చోట్ల ఈ దాడులు జరిపామని చెప్పింది. ఇవి బలగాలు జరిపిన అతిసహజమైన దాడులని, ఉద్రిక్తతలకు పెంచే చర్యలు కావని, పాక్ మిలటరీ స్థావరాల జోలికి వెళ్లలేదని తెలిపింది. దాడి లక్ష్యాలు, అమలు విషయంలో భారత బలగాలు సంయమనంగా వ్యవహరించినట్టు పేర్కొంది.


కాగా, భారత్ దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్, భారత్‌పై పలు దాడుల ప్రధాన సూత్రధారి మౌలానా మసూద్ కుటుంబానికి చెందిన 14 మంది హతమైనట్టు తెలుస్తోంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందని, ఇది దేశం గర్వహించదగిన సమయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులతో జరిగిన సమావేశంలో తెలిపారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుని జరిగిన పరిణామాలను ప్రధాన వివరించారు.


ఇవి కూడా చదవండి:

ఆపరేషన్ సిందూర్‌లో వాడిన ఈ మిసైల్స్ గురించి తెలుసా

పాక్‌‌పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభం.. 9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు

రేపే సెక్యూరిటీ డ్రిల్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Read Latest and National News

Updated Date - May 07 , 2025 | 03:11 PM