Rahul Gandhi: ఇక సినిమా చూపించడమే ఆలస్యం: రాహుల్ గాంధీ
ABN, Publish Date - Aug 12 , 2025 | 02:49 PM
ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఇందుకు సిద్ధమవుతోందని ఆరోపించారు. మంగళవారంనాడు పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ, ఒకటి రెండు సీట్లలో కాకుండా చాలా సీట్లలో ఓట్ల చోరీ జరుగుతోందని, ఇది ఒక క్రమపద్ధతిలో జాతీయ స్థాయిలో జరుగుతోందని అన్నారు.
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. గత ఏడాది కర్ణాటక, మహారాష్ట్రలలో బీజేపీతో కలిసి ఓట్ల చోరీ చేసిన ఎన్నికల కమిషన్ ఈ ఏడాది చివర్లో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీకి సన్నద్ధమవుతోందన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఇందుకు సిద్ధమవుతోందని ఆరోపించారు. మంగళవారంనాడు పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ, ఒకటి రెండు సీట్లలో కాకుండా చాలా సీట్లలో ఓట్ల చోరీ జరుగుతోందని, ఇది ఒక క్రమపద్ధతిలో జాతీయ స్థాయిలో జరుగుతోందని అన్నారు. ఎన్నికల కమిషన్‌కు ఇది తెలుసుననీ, గతంలో దీనికి ఆధారాలు లేవనీ, ఇప్పుడు ఉన్నాయని పేర్కొన్నారు.
'మేము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నాం. ఒక వ్యక్తి ఒకే ఓటు అనే విధిని ఎన్నికల కమిషన్ పాటించడం లేదు. ఇక సినిమా చూపించడమే ఆలస్యం' అని రాహుల్ చమత్కరించారు. ఓట్ల చోరీ వావాదంపై విపక్షాల నిరసనను 'టీజర్'గా రాహుల్ ఇంతకుముందు పేర్కొన్నారు.
బిహార్‌లో ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్), ఓట్ల చోరీపై 'ఇండియా' కూటమి నేతలు సోమవారం ఉదయం పార్లమెంటు మకర ద్వారం నుంచి ర్యాలీగా బయలుదేరి తీవ్ర నిరసనలు తెలిపారు. అనుమతి లేదంటూ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ప్రియాంక గాంధీ వాద్రా, అఖిలేష్ యాదవ్, శివసేన నేత సంజయ్ రౌత్ సహా 29 మంది ఎంపీలను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఓటర్ల జాబితా స్కాన్ ఫోటోగ్రాఫ్‌లతో పోస్ట్ చేయడం కాకుండా మెషీన్-రీడబుల్ ఓటర్ లిస్టులు విడుదల చేయాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. స్కాన్ ఫోటోగ్రాఫ్‌లతో తప్పులు చెక్ చేసుకోవడం దాదాపు అసాధ్యమని వారు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
జస్టిస్ వర్మ నోట్ల కట్టల ఉదంతం కీలక మలుపు.. అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన లోక్‌సభ స్పీకర్
తిక్క రేగిందంటే బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపిస్తాం.. బిలావల్‌కు మిథున్ చక్రవర్తి వార్నింగ్
For More National News and Telugu News
Updated Date - Aug 12 , 2025 | 04:15 PM