ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: పల్లవుల కాలంనాటి శిల్పాలు లభ్యం

ABN, Publish Date - Jun 13 , 2025 | 12:17 PM

విల్లుపురం జిల్లా తిరువెనైనల్లూరు సమీపంలోని మేల్‌దనియాళంపట్టు గ్రామంలో పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో పల్లవరాజుల కాలంనాటి దేవతామూర్తుల శిల్పాలు లభ్యమయ్యాయి. ఈ గ్రామంలో విల్లుపురంకు చెందిన పురావస్తుశాఖ పరిశోధకులు సెంగుట్టువన్‌, తమిళలగన్‌ పర్యవేక్షణలో తవ్వకాలు కొనసాగుతున్నాయి.

చెన్నై: విల్లుపురం(Villupuram) జిల్లా తిరువెనైనల్లూరు సమీపంలోని మేల్‌దనియాళంపట్టు గ్రామంలో పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో పల్లవరాజుల కాలంనాటి దేవతామూర్తుల శిల్పాలు లభ్యమయ్యాయి. ఈ గ్రామంలో విల్లుపురంకు చెందిన పురావస్తుశాఖ పరిశోధకులు సెంగుట్టువన్‌, తమిళలగన్‌ పర్యవేక్షణలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిపిన తవ్వకాల్లో పల్లవరాజుల కాలంనాటి కొరవై, మూర్తదేవి శిల్పాలు బయల్పడ్డాయి.

వీటిన పరిశీలించిన పరిశోధకులు దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవరాజ(Pallavaraja) వంశీయులు వందల సంఖ్యలో దేవాలయాలను నిర్మించి నిత్యపూజలు చేయించారని, ఆ రీతిలో విల్లుపురం జిల్లాలో నిర్మించిన ఆలయాల్లో మేల్‌దనియాళంపట్టు గ్రామం చెరువుగట్టున విష్ణుదుర్గాలయం ఒకటని తెలిపారు.

ఈ ఆలయం గర్భగుడిలో ప్రస్తుతం లభ్యమైన అమ్మవార్ల విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేసేవారని, ఈ ఆలయానికి వెళ్ళేందుకు 8 సొరంగ మార్గాలు కూడా నిర్మించినట్లు చరిత్ర చెబుతోందని తెలిపారు. సుమారు 1,200 ఏళ్ళ (8వ శతాబ్దం) నాటి ఈ శిల్పాలను భద్రపరిచేందుకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అప్పగించినట్లు పరిశోధకులు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి.

9 నెలల్లోనే జనాభా లెక్కలు రెడీ

రోడ్డు నిర్మించకుండానే బిల్లుల మంజూరు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 13 , 2025 | 12:17 PM