ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gang Rape : ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లో 24 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

ABN, Publish Date - Aug 14 , 2025 | 09:01 AM

ఢిల్లీ తిలక్ నగర్‌కు చెందిన 24 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. పార్టీకి పిలిచి ఆమెకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి మహిళపై కొంతమంది వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు.

Gang Rape

న్యూఢిల్లీ, ఆగస్టు 14 : రాజధాని ఢిల్లీ తిలక్ నగర్‌కు చెందిన 24 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. మహిళపై కొంతమంది వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి బాధితురాలిని స్నేహితుడి ఇంట్లో జరిగిన పార్టీకి ఆహ్వానించి ఈ దుర్మార్గానికి ఒడిగట్టునట్టు తెలుస్తోంది. బాధితురాలు తన సోదరితో కలిసి పార్టీకి వెళ్లింది. అయితే, ఈ దారుణం జరిగిన 13-14 గంటల తర్వాత ఘటన గురించి తమకు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు పార్టీ ప్రాంతానికి చేరుకునేసరికి ఆమె స్నేహితుడితో పాటు మరో నలుగురు పురుషులు ఆ ఇంట్లో ఉన్నారని బాధితురాలు చెబుతోంది.. ఆమెకు ఇచ్చిన డ్రింక్ లో ఏదో కలిపినందున ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని పోలీసులు అంటున్నారు. ఆ తర్వాత ఆ గ్యాంగ్.. ఆమెను బాత్రూంలోకి తీసుకెళ్లారని, అక్కడ ఆ వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, అదంతా వీడియో తీశారని ఆమె పోలీసులకు తెలిపింది.

దీని గురించి ఎవరికైనా చెబితే, వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తామని నిందితుడు బెదిరించినట్లు తెలుస్తోంది. అనంతరం బాధితురాలిని ఆమె ఇంటి బయట వదిలేశారని పోలీసులు తెలిపారు. సోమవారం ఆమె సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. ఆమె వాంగ్మూలం నమోదు చేసి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత, ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితులను ప్రస్తుతం గుర్తించే పనిలో ఉన్నారు. వారిని గుర్తించడానికి సిసిటివి ఫుటేజ్‌లను విశ్లేషిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాకిస్థాన్‌ బెదిరింపులకు భయపడేది లేదు

బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 14 , 2025 | 09:01 AM