ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Covid: దేశ వ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా.. 1828కి పెరిగిన కేసులు..

ABN, Publish Date - May 30 , 2025 | 03:45 PM

కరోనా మరోసారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అమెరికా, సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ దేశాలలో ఇప్పటికే పలు ఆసుపత్రులు కరోనా కేసులతో నిండిపోయాయి. క్రమంగా భారతదేశంలో కూడా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది.

Covid

Covid: కరోనా ప్రపంచాన్ని మరోసారి అతలాకుతలం చేస్తోంది. అమెరికా, సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ దేశాలలో ఇప్పటికే పలు ఆసుపత్రులు కరోనా కేసులతో నిండిపోయాయి. క్రమంగా భారతదేశంలో కూడా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో 1,828 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 15 మంది కరోనాతో మృతి చెందారు. అందులో ఆరుగురు మహారాష్ట్రకు చెందిన వారు ఉన్నారు. గుజరాత్‌లో గురువారం ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. వారిలో 8 నెలల శిశువు కూడా ఉంది. ప్రస్తుతం ఆ శిశువు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కేరళలో మొత్తం 727 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఓమిక్రాన్ JN వేరియంట్ LF7 కేసులు పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి విజయన్ ధృవీకరించారు.

దేశ వ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా

జనవరి నుంచి మహారాష్ట్ర కోవిడ్ పరీక్షలు నిర్వహించగా మొత్తం ఇప్పటి వలరకు 9,500 కి పైగా కేసులు నమోదు అయ్యాయి. గురువారం ఒక్క రోజే 79 కొత్త కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ముంబైలో 373 కేసులు పెరిగాయి. జమ్మూ & కాశ్మీర్‌లో గురువారం రెండు కొత్త కేసులు నిర్ధారించారు. అటు ఏపీలోనూ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా క్రమంగా కరోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి.


కరోనాలో అనేక కొత్త రకాలు వస్తున్నాయని WHO ఇటీవల తెలిపింది. వీటిలో NB.1.8.1, JN.1, KP.2 వంటి వేరియంట్‌లు ఉన్నాయి. ఇవి ఓమిక్రాన్ వేరియంట్‌లు. NB.1.8.1 వేరియంట్ ప్రస్తుతం చైనా, అమెరికా తోపాటు కొన్ని యూరోపియన్ దేశాలలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. అదే సమయంలో, భారతదేశంతో సహా అనేక దేశాలలో కరోనా NB.1.8.1, LF.7 రెండు ఉప-వేరియంట్ల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.


Also Read:

ప్రతి మహిళ తప్పక చేయించుకోవాల్సిన 8 ఆరోగ్య పరీక్షలు..

భారతీయుల 'ఎనర్జీ డ్రింక్' ఇదే! కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

For More Health News

Updated Date - May 30 , 2025 | 05:14 PM