ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Yoga For Migraine: తరచూ తల భారంగా ఉంటోందా.. ఈ యోగాసనాలతో శాశ్వత పరిష్కారం..

ABN, Publish Date - Apr 29 , 2025 | 08:41 AM

Yoga For Migraine Relief: మైగ్రేన్ బాధితులు పడే బాధ అంతాఇంతా కాదు. ఒకసారి ఈ నొప్పి మొదలైతే గంటల నుంచి రోజుల వరకూ పోదు. ఏ పనిపైనా దృష్టిపెట్టలేరు. జీవితం నిస్సారంగా అనిపించి చిరాకు, ఒత్తిడికి లోనవుతుంటారు. మందులు వేసుకున్నా శాశ్వత పరిష్కారం లభించదు. కానీ, ఈ సింపుల్ యోగాసనాలు రోజూ సాధన చేస్తే మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

Yoga For Migraine Relief

Yoga Poses For Migraine Relief: యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదు. మనసు, శరీరం, ఆత్మను ఒక్కటి చేసే మార్గం. శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఆసనాలు లేదా భంగిమలు ఉపయోగపడతాయి. అలాగే ఒత్తిడి,ఆందోళనలు దూరం చేసి మనలో ఉత్సాహాన్ని నింపుతాయి. మందులకు లొంగని ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను యోగాసనాల ద్వారా అదుపు చేయవచ్చు. అలాంటి వాటిలో మైగ్రేన్ తలనొప్పి ఒకటి. ఒకపక్క తల పగిలిపోతుందేమో అనేంత తీవ్రమైన నొప్పి, వికారం, వాంతులు, కళ్లు ఎర్రబడిపోయి నీళ్లు కారిపోవడం, లైట్ చూసినా, శబ్దం విన్నా భరించలేనంత తలనొప్పి సహా అనేక లక్షణాలు మైగ్రేన్ బాధితుల్లో కనిపిస్తాయి. శరీరంలోని ప్రతి అవయవం, మనసుపై ఇది చెడు ప్రభావం చూపిస్తుంది. హార్మోన్లు, జీవనశైలి, టెన్షన్ తదితర కారణాల వల్ల వచ్చే ఈ వ్యాధికి కింది యోగాసనాలతో శాశ్వత పరిష్కారం లభిస్తుంది.


బాలసనం

బాలసనం ఒక సున్నితమైన భంగిమ. దీన్ని పిల్లల భంగిమ అని కూడా అంటారు. ఇలా చేయడం వల్ల మెడ, భుజాలు, వెన్నెముక, తుంటి తొడలు, పై ఒత్తిడి తగ్గి హాయిగా అనిపిస్తుంది. శ్వాసక్రియ మెరుగుపడుతుంది. మనసుకు, శరీరానికి విశ్రాంతిగా అనిపిస్తుంది.

ఎలా వేయాలి

ముందుగా మోకాళ్లపై కూర్చుని ఆ తర్వాత రెండు చేతులను చాచి ముందుకు వంగాలి. చేతులను, తలను ముందు వైపుకు వంచి నేలకు ఆనించాలి. తర్వాత కనీసం 8 సార్లు గట్టిగా శ్వాస తీసుకునే వరకూ అదే భంగిమలో ఉండాలి. పిల్లలు బోర్లా పడుకున్నట్టుగా ఉన్న స్థితిలో రోజూ 1-3 నిమిషాల పాటు ఉంటే తలనొప్పి సమస్య పోతుంది.


అధో ముఖ స్వనాసన

అధో ముఖ స్వనాసన అని కూడా పిలువబడే ఈ భంగిమ మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. మెడ, పాదాలు, చేతులు సాగదీసినట్లుగా చేయడం వల్ల కండరాలు బలిష్టంగా తయారవుతాయి. మైగ్రేన్‌లకు కారణమయ్యే సైనస్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఎలా వేయాలి

ముందుగా నిటారుగా నిలబడిన తర్వాత అరికాళ్లపై బరువు వేస్తూ ముందుకు వంగి రెండు చేతులను నేలకు ఆనించాలి. మొత్తం శరీరం రివర్స్ వీ షేప్‍లో ఉండేలా చూసుకోవాలి. 5 నుంచి 10 సార్లు శ్వాస తీసుకునేవరకూ ఈ స్థితిలో ఉండాలి.


విపరీత కరణి

విపరీత కరణి ఆసనం తలకు రక్త ప్రసరణను పెంచుతుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. కాబట్టి, తలనొప్పి సమస్య నుంచి రిలీఫ్ దక్కుతుంది. ఇదేకాక నడుము, కాళ్ళలో ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఎలా వేయాలి

ఈ ఆసనంలో మీరు రెండు కాళ్ళను గోడకు ఆనించి వీపుపై పడుకోవాలి. 5 నుంచి 15 నిమిషాలపాటు ఈ స్థితిలో ఉంటే చాలు.


పశ్చిమోత్తనాసనం

పశ్చిమోత్తనాసనం వేసినపుడు వెన్నెముక సాగుతుంది. తలనొప్పికి, సాధారణ వెన్నునొప్పికి విశ్రాంతి లభిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి శక్తి లభించడంతో పాటు ఆందోళన, ఒత్తిడి తగ్గిపోతాయి.

ఎలా వేయాలి

రెండు కాళ్లను ముందుకు చాచి కూర్చొన్న తర్వాత శరీరాన్ని మొత్తం వంచి వీలైనంత వరకూ రెండు చేతులతో కాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించాలి. ఈ భంగిమలో రోజూ 30 సెకన్ల నుంచి 1 నిమిషం ఉంటే చాలు.


Read Also: AC: మీ ఇంట్లో ఏసీ ఉందా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..

Relationship Tips: పెళ్లికి ముందు మీ జీవిత భాగస్వామిలో ఈ 3 లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి..

Parenting Tips: పిల్లలను ఏసీ గదిలో ఉంచుతున్నారా.. ఈ విషయాలపై జాగ్రత్త..

Updated Date - Apr 29 , 2025 | 11:14 AM