ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Skincare Tips: వేసవిలో మొటిమలు పెరిగిపోతున్నాయా.. ఈ సింపుల్ టిప్స్‌తో మచ్చలేని చర్మం..

ABN, Publish Date - May 05 , 2025 | 03:36 PM

Summer Skincare Tips: మొటిమలు ముఖ సౌందర్యాన్ని పాడుచేస్తాయి. ఇక మండే ఎండల్లో మరింత చికాకు పెడతాయి. అయితే, మండే ఎండల్లోనూ మచ్చల్లేని క్లియర్ స్కిన్ మీ సొంత కావాలని కోరుకుంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి.

Skincare For Pimples

Natural Remedies For Pimples: వేసవి కాలంలో అనేక ఇబ్బందులు వస్తాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం చెమటతో తడిసిపోతుంది. చర్మ సంరక్షణ కోసమూ ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే కమిలిపోయి రంగు మారుతుంది. ఇక ఎండాకాలంలో మొటిమలు రావడం కూడా సర్వసాధారణం. దీనికి కారణం వేడి, చెమట, దుమ్ము, చర్మంలో నూనె ఉత్పత్తి పెరగడం. ఈ కారకాలన్నీ కలిసి చర్మ రంధ్రాలను మూసివేసి మొటిమలకు కారణమవుతాయి. దీనికి తోడు చర్మం జిడ్డు కారుతూ ఉండటం, వడలిపోయిపోయినట్లు అనిపించి దురద, చికాకు కలుగుతాయి. కానీ, వేసవిలోనూ మచ్చల్లేని శుభ్రమైన చర్మం కావాలని మీరు కోరుకుంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. ఈ 5 మార్పులతో మెరిసే చర్మానికి హలో చెప్పండి.


1. తరచుగా ముఖం కడుక్కోవడం

వేసవిలో ప్రజలు చల్లగా ఉంటుందని తరచుగా ముఖం కడుక్కుంటూ ఉంటారు. అయితే, ఇలా పదే పదే ఫేస్ వాష్ చేయడం చర్మంలోని సహజ నూనె తొలగిపోతుంది. కొన్ని సార్లు మనం వాడే సోప్ వల్ల చర్మం పై పొరలు తొలగిపోతుంది. అప్పుడు మరింత ఎక్కువగా నూనె ఉత్పత్తి అయి జిడ్డుగా మారుతుంది. కాబట్టి, ఫేస్ వాష్ తో రోజుకు రెండుసార్లు ముఖాన్ని కడుక్కుంటే సరిపోతుంది.


2. జెల్ ఆధారిత ఉత్పత్తులు

ప్రతి సీజన్‌లో ఒకేలాంటి చర్మ ఉత్పత్తులను ఉపయోగించడం సరికాదు. వేసవిలో, భారీగా క్రీములు రాసినా లేదా జిడ్డుగల ఉత్పత్తులు వాడిని ఇవి చర్మాన్ని కప్పేస్తాయి. బదులుగా, కలబంద జెల్ లేదా నీటి ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఉపయోగించండి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా, తాజాగా ఉంచుతాయి.


3. సన్‌స్క్రీన్‌

వేసవిలో అతి ముఖ్యమైన విషయం సన్‌స్క్రీన్. బయటికి వెళ్లేటప్పుడు ముఖానికి సన్‌స్క్రీన్‌ అప్లై చేసుకోవడం మంచిదే. కానీ, సరైన లోషన్ ఎంచుకోకపోతే అది మొటిమలు, మచ్చలను మరింత పెంచుతుంది. అందుకే SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న నాన్-కామెడోజెనిక్ సన్‌స్క్రీన్‌నే ఎల్లప్పుడూ వాడండి.


4. తక్కువ మేకప్

హెవీ మేకప్ చర్మాన్ని బ్లాక్ చేస్తుంది. సమ్మర్ లో మేకప్ తప్పనిసరి పరిస్థితుల్లో వేసుకోవాల్సి వస్తే లైట్ గానే అప్లై చేసుకోండి. అలాగే పడుకునే ముందు తేలికపాటి క్లెన్సర్‌తో పూర్తిగా శుభ్రం చేయండి. తద్వారా చర్మం వేడిలో కూడా తాజాగా, ఆరోగ్యంగా ఉంటుంది.


5. చేతులతో ముఖాన్ని తాకడం

ఎండాకాలంలో ముఖంపై నిరంతరం చెమటలు కారిపోతూనే ఉంటాయి. పదే పదే తుడుచుకుంటూ ఉంటాము. నిజానికి, మన చేతుల్లో బ్యాక్టీరియా ఉంటుంది. చెమటను తుడుచుకునేందుకు చేత్తో ముఖాన్ని తాకిన ప్రతిసారీ అవి చర్మానికి బదిలీ అవుతాయి. ఇందువల్లే మొటిమల సమస్య ఇంకా పెరుగుతుంది. కాబట్టి, ఈ అలవాటును మానేసి శుభ్రతపై శ్రద్ధ వహించండి. బదులుగా న్యాప్ కిన్ వాడండి. అయితే, ఎప్పటికప్పుడు శుభ్రమైన క్లాత్ మాత్రమే ఉపయోగించండి. మొటిమల సమస్య పోయి మచ్చలేని మెరిసిపోయే చర్మం మీ సొంతమవుతుంది.


Read Also: Stress Relief:ఒత్తిడిని చిటికెలో తరిమేసే 5 పవర్‌ఫుల్ టెక్నిక్స్..

Parenting Tips: తల్లిదండ్రుల ఈ అలవాట్ల వల్ల పిల్లలు వారిని ద్వేషిస్తారు..

Chanakya Niti: జీవితంలో అదృష్టవంతులు మాత్రమే వీటిని పొందుతారు..

Updated Date - May 05 , 2025 | 03:37 PM