Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..
ABN, Publish Date - Apr 30 , 2025 | 07:26 PM
కొందరు దెయ్యాలను చూశామని చెబుతారు. ఇంకొంత మంది మాత్రం అలాంటివి ఉండవని అంటారు. కానీ అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం దెయ్యాలు ఉండే అనేక రాష్ట్రాలు ఉన్నాయంటా. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
మీకు దెయ్యాల కథలు, ఆత్మల గురించి తెలుసా. వీటి గురించి అనేక మందికి ఆసక్తి ఉంటుంది కూడా. కానీ కొంత మంది వీటిని ఉన్నాయని భావిస్తే, మరికొంత మంది మాత్రం లేవని కొట్టిపారేస్తారు. ఈ భయానక ప్రపంచంలో అనేక మంది కూడా ఆసక్తి కలిగినవారు ఉంటారు. అయితే ఓ ప్రాంతంలో మాత్రం అనేక ప్రాంతాలు హాంటెడ్ రాష్ట్రాలుగా ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
దెయ్యాల సందర్శనలు
నివేదికల ప్రకారం అగ్రరాజ్యం అమెరికాలో అత్యంత హాంటెడ్ రాష్ట్రాలుగా టెక్సాస్, కాలిఫోర్నియా నిలిచాయి. ఈ రాష్ట్రాల్లో చోటుచేసుకున్న అనేక దెయ్యాల సందర్శనలు నిజంగానే వెన్నులో చలి పుట్టించేవిగా ఉంటాయని చెబుతున్నారు. చెరిగిపోయిన ఇళ్ళు, హోటల్స్, శ్మశానాల వెనుక చెదిరిపోయిన కథలు ఇవన్నీ మీకు నిజమైన భయాన్ని అందిస్తాయని అంటున్నారు. మీరు ధైర్యవంతులైతే ఈ హాంటెడ్ ప్రదేశాలను సందర్శించాలని చెబుతున్నారు.
అత్యంత హాంటెడ్ రాష్ట్రాలు
2005 నుంచి 2020 వరకు టెక్సాస్‌లో మొత్తం 6,845 దెయ్యాల సందర్శనలు నమోదయ్యాయి. అంటే సంవత్సరానికి సగటున 456 సందర్శనలు. కాలిఫోర్నియాలో 6,444 సందర్శనలు నమోదయ్యాయి. టెక్సాస్‌లో 28.7 మిలియన్ల జనాభా ఉంటే, దీని ప్రకారం కేవలం 0.0238 శాతం మంది మాత్రమే దెయ్యాలను చూశామని చెప్పారు. ఈ గణాంకాలు మీకు కొంచెం భయం కలిగించినా, ఒహాయో, మిచిగాన్, ఇల్లినాయిస్ ప్రాంతాల్లో సంవత్సరానికి దాదాపు 2,000 దెయ్యాల సందర్శనలు నమోదవుతాయని చెబుతున్నారు.
హాంటెడ్ ల్యాండ్‌మార్క్‌లు
మీరు ధైర్యవంతులైతే ఈ భయంకరమైన ప్రదేశాలను సందర్శించాలంటున్నారు. CoreLogic, Ghosts and Gravestones ప్రకారం అనేక ప్రదేశాలు ఉన్నాయని చెబుతున్నారు. వాటిలో కొన్నింటి గురించి ఇక్కడ చూద్దాం.
ది క్వీన్ మేరీ ఓషన్ లైనర్, లాంగ్ బీచ్, కాలిఫోర్నియా: ఈ చారిత్రాత్మక ఓడలో అనేక అసాధారణ సంఘటనలు నమోదయ్యాయి
హిల్ హౌస్, మినరల్ వెల్స్, టెక్సాస్: ఈ ఇంటిలో దెయ్యాలు తిరుగుతున్నాయని చెబుతారు
ది వేలీ హౌస్, శాన్ డియాగో, కాలిఫోర్నియా: ఈ ఇల్లు దెయ్యాల కథలకు ప్రసిద్ధి
ది స్టాన్లీ హోటల్, ఎస్టెస్ పార్క్, కొలరాడో: స్టీఫెన్ కింగ్ రాసిన "ది షైనింగ్"కు ప్రేరణగా నిలిచింది
ఫ్రాంక్లిన్ కాసిల్, క్లీవ్‌ల్యాండ్, ఒహాయో: ఈ కోటలో అనేక భయంకర సంఘటనలు వెలుగులోకి వచ్చాయి
హోటల్ చెల్సియా, న్యూయార్క్: ఈ హోటల్‌లో అసాధారణ కార్యకలాపాలు నమోదయ్యాయి
లాలారీ మాన్షన్, న్యూ ఓర్లీన్స్, లూసియానా: ఈ మాన్షన్ భయంకర చరిత్రకు ప్రసిద్ధి చెందింది
ది ఓల్డ్ జైల్, సెయింట్ ఆగస్టిన్, ఫ్లోరిడా: ఈ జైలులో దెయ్యాలు తిరుగుతున్నాయని చెబుతారు
మిర్టిల్స్ ప్లాంటేషన్, సెయింట్ ఫ్రాన్సిస్‌విల్లే, లూసియానా: ఈ ప్లాంటేషన్ దెయ్యాల కథలకు కేంద్రంగా ఉంది
ది సాలీ హౌస్, అట్చిసన్, కాన్సాస్: ఈ ఇంటిలో భయంకర సంఘటనలు నమోదయ్యాయి
మీ భయంకర కథను పంచుకోండి
మీరు ఏదైనా భయంకరమైన లేదా అసాధారణమైన దృశ్యాన్ని చూస్తే Ghosts of Americaతో మీ కథను పంచుకోండి. వారు అమెరికా అంతటా జరిగే ఈ భయంకర సంఘటనలను ట్రాక్ చేస్తారు. ఇలా అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Meta AI App: చాట్ జీపీటీకి పోటిగా మెటా నుంచి కొత్త ఏఐ యాప్..పోటీ ఇస్తుందా..
RRBs: ఈ 15 బ్యాంకులు మే 1 నుంచి బంద్.. మీ డబ్బు భద్రమేనా..
Central Government: జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 30 , 2025 | 07:27 PM