ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Abdul Kalam Quotes: ప్రతి ఒక్క విద్యార్థి తప్పక చదవాల్సిన కలాం సూక్తులు!

ABN, Publish Date - Aug 08 , 2025 | 06:58 PM

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.. ఈ పేరు చెబితే ఒకటి కాదు.. మేధావి, శాస్త్రవేత్త, మిస్సైల్ మ్యాన్, పీపుల్స్ ప్రెసిడెంట్, స్ఫూర్తి ప్రదాత, నిరాండబరత, ఇలా ఎన్నెన్నో గుర్తొస్తాయి. విద్యార్థుల ప్రగతి కోసం నిత్యం పరితపించే ఆయన.. వారి కోసం పలు సందర్భాల్లో చెప్పిన కొన్ని అద్భుత సూక్తులు..

APJ Abdul Kalam Quotes for Students

భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన మేధావి, శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓ స్ఫూర్తి శిఖరం. మిస్సైల్ మ్యాన్‌గా, మానవతావాదిగా, భారతీయుల గుండెల్లో అజరామరంగా నిలిచిపోయిన కలాం.. ఓటమిలో విజయం ఎలా చూడవచ్చో నేర్పారు. స్వయంకృషి, పట్టుదలతో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన అబ్దుల్ కలాం.. అన్ని రంగాల్లోనూ విలక్షణ ముద్రవేశారు. పేద కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ఆయన.. చివరి శ్వాస వరకూ నిరాడంబర జీవితం గడిపారు. మరణించిన తర్వాత తన అద్భుత సూక్తులతో ఎంతో మంది విజయాలకు ఊపిరి పోస్తు్న్నారు. ఆయన చెప్పిన కొన్ని సక్సెస్ మీకోసం..

  • చిన్న విజయాన్ని చూసి మురిసిపోవద్దు.. అది తొలి అడుగు మాత్రమే.. గమ్యం కాదు..

  • మీరు మీ భవిష్యత్తును మార్చలేరు. కానీ, మీ అలవాట్లను మార్చుకోగలరు. కాబట్టి, మీ అలవాట్లు మార్చుకుంటే భవిష్యత్తు మారుతుంది.

  • ఒక మంచి పుస్తకం..వందమంది మిత్రులతో సమానం. కానీ, ఒక మంచి స్నేహితుడు..ఒక గ్రంథాలయంలో సమానం.

  • కల అంటే నిద్రలో వచ్చేది కాదు..నిద్ర పోనివ్వకుండా చేసేది.

  • ఎవరినైనా తేలిగ్గా ఓడించవచ్చు. కానీ, వారి మనసును గెలవాలంటే మాత్రం ఎంతో శ్రమించాలి.

  • నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే..ముందు సూర్యుడిలా మండటానికి సిద్ధపడాలి.

  • జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నప్పుడే..విజయాలను ఆస్వాదించగలం.

  • మన పుట్టుక సాధారణమైనదే కావచ్చు. కానీ, మరణం మాత్రం చరిత్రను సృష్టించేదిగా ఉండాలి.

  • మీ ప్రయత్నం లేకపోతే విజయం రాదు.కానీ, మీరు ప్రయత్నిస్తే ఓటమి రాదు.

  • అహంకారం ప్రతి ఒక్కరి నుండి.. ఆఖరికి భగవంతుడి నుంచి దూరం చేస్తుంది.. కాబట్టి, అహంకారాన్ని వదిలివేయండి.

  • అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోవద్దు. అవి తప్పులు కావు. భవిష్యత్తులో మనమేం చేయాలో చెప్పే పాఠాలు.

  • అద్దం మాత్రమే మీ బెస్ట్ ఫ్రెండ్.. ఎందుకంటే నువ్వు ఏడ్చినప్పుడు అది నవ్వదు.

  • నీ మొదటి విజయం తర్వాత అలక్ష్యం ప్రదర్శించవద్దు. ఎందుకంటే.. నీ రెండవ ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే.. నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చిందని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తుంటారు.

  • సక్సెస్ అంటే..మీ సంతకం ఆటోగ్రాఫ్‌గా మారడమే!

  • అందం ముఖంలో ఉండదు.సాయం చేసే మనసులో ఉంటుంది.

  • కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి..నిన్ను నీవు నిరూపించుకోవడానికే వచ్చాయి.కష్టాలకు కూడా తెలియాలి.. నిన్ను సాధించడం కష్టమని.

  • మనం కేవలం విజయాల నుంచే పైకి రాలేము.. అపజయాల నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి.

  • మనిషి శరీరాన్ని ధరించినపుడు సాక్షాత్తూ భగవంతుడైనా సరే.. బాధలను అనుభవించి తీరవలసిందే.. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా.. పరిష్కారంపై ఉంచండి..

  • నీ విజయాన్ని అడ్డుకునేది నీ ప్రతికూల ఆలోచనలే.. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే.. చేసే పనిలో ఎన్నటికీ విజయాన్ని సాధించలేము.

  • మనస్ఫూర్తిగా పనిచేయలేని వారు.. ఎన్నటికీ సక్సెస్ సాధించలేరు.

ఈ వార్తలు కూడా చదవండి..

వర్షాకాలంలో తడి బట్టల టెన్షన్‌కు గుడ్ బై చెప్పండిలా!
ధనవంతులు కావాలంటే ఈ అలవాట్లు వదులుకోవాల్సిందే.. చాణక్యుడు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 08 , 2025 | 08:24 PM