ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tips To Cook Dal: పప్పులోని పోషకాలు అందాలంటే.. తప్పనిసరిగా ఇలా చేయండి.!

ABN, Publish Date - Jul 19 , 2025 | 01:41 PM

పప్పు మన రోజువారీ ఆహారంలో చాలా ముఖ్యమైన భాగం. కానీ దాన్ని సరైన విధంగా వండకపోతే దాని పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి, పప్పు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Dal

ఇంటర్నెట్ డెస్క్‌: పప్పు భారతదేశంలో చాలా సాధారణమైన ఆహారం. చాలా మంది పప్పును ఎంతో ఇష్టంగా తింటారు. కొంత మందికి ఎన్ని వంటలు ఉన్నా కచ్చితంగా పప్పు ఉండాల్సిందే. దీంట్లో ప్రోటీన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని అనేక రకాలుగా వండుతారు. ఇది ఆరోగ్యకరమైన ఆహారం. కానీ పప్పు చేసేటప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్లు దాని పోషకాలు తగ్గిపోయేలా చేస్తాయి. కాబట్టి పప్పు వండేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పోషకాహార నిపుణుల ద్వారా తెలుసుకుందాం..

కనీసం 2 గంటలు..

చాలా మంది పప్పు చేసేటప్పుడు రెండు పొరపాట్లు చేస్తారు. మొదటిది, పప్పును నానబెట్టకుండా వండటం, రెండోది.. నానబెట్టిన నీటిని పారవేయడం. ఈ రెండు పొరపాట్ల వల్ల శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు అందవు. కాబట్టి, పప్పును 3 నుండి 4 సార్లు బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల దుమ్ము, పాలిష్‌, రసాయనాలు, మలినాలు తొలగిపోతాయి. కనీసం 2 గంటల పాటు నానబెట్టాలి. ఇది పప్పులో ఉండే యాంటీ-న్యూట్రియెంట్స్ (పేగు జీర్ణాన్ని నిరోధించే పదార్థాలు)ను తొలగించడంలో సహాయపడుతుంది. దీంతో శరీరం పప్పులోని ప్రోటీన్‌ను బాగా గ్రహించగలదు.

నానబెట్టిన నీటిని..

పప్పు నానబెట్టిన నీటిలో విటమిన్ B, విటమిన్ E వంటి కీలక పోషకాలు ఉంటాయి. ఆ నీటిలో పోషకాలు ఉంటాయి. అయితే, ఆ నీటిని వండటానికి పారవేయకుండా వేరే ప్రయోజనాలకు ఉపయోగించండి. (ఉదాహరణకు పచ్చడికి, పానీయం చేయడానికి ఉపయోగించండి). పప్పు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు అధికంగా కలిగి ఉంటుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం. శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

For More Health News

Updated Date - Jul 19 , 2025 | 02:02 PM