Savings: పెరుగుతున్న ఖర్చులు.. ఆర్థిక భద్రత కోసం ఇలా ప్లాన్ చేయండి..
ABN, Publish Date - Jun 23 , 2025 | 02:32 PM
ఆర్థిక సమస్యలను సమర్థంగా ఎదుర్కోవాలంటే ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయడం చాలా ముఖ్యం. మనం ఎంత సంపాదించినా దాన్ని సరిగ్గా పొదుపు చేయకపోతే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి..
Savings: పొదుపు అంటే డబ్బుని జాగ్రత్తగా వాడుకోవడం, వృధా చేయకుండా ఉండటం. సాధారణంగా, పొదుపు అంటే ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం లేదా పెట్టుబడుల కోసం పక్కన పెట్టడం. పొదుపు అనేది ఒక అలవాటు మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం కూడా. ఇది ఆర్థికంగా బాధ్యతాయుతంగా ఉండటానికి, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది.
ఆర్థిక సమస్యలను సమర్థంగా ఎదుర్కోవాలంటే ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయడం చాలా ముఖ్యం. మనం ఎంత సంపాదించినా దాన్ని సరిగ్గా పొదుపు చేయకపోతే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. భవిష్యత్ అవసరాలు, అనుకోని వైద్య ఖర్చులు, పిల్లల చదువు, పదవీ విరమణ తర్వాతి జీవితం.. ఇవన్నీ పెద్ద ఖర్చులే. ఇవన్నిటికి ముందుగానే సిద్ధంగా ఉండాలంటే, చిన్న వయసు నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలి. క్రమంగా ఇది జీవిన శైలిలో భాగంగా మారిపోతుంది.
పొదుపు ప్రణాళికలు
మీరు 20 ఏళ్ల నుండే పెట్టుబడి ప్రారంభించడం మంచిది. ఇలా చేయడం వల్ల మీరు భవిష్యత్తులో సంతోషంగా ఉంటారు. మీరు ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని సిప్‌లో పెట్టుబడి పెట్టండి. సిప్ (SIP) అంటే క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళిక. ఇది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి మంచి మార్గం.30 ఏళ్లలో ఆదాయం పెరుగుతుంది కాబట్టి పొదుపు కూడా పెంచడం మంచిది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) , ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), మ్యూచువల్ ఫండ్స్ లాంటి సాధనాలను ఉపయోగించండి.
40 ఏళ్లలో మీ ఆదాయం మరింత పెరుగుతుంది కాబట్టి మీ నెల ఆదాయంలో కనీసం 25 నుండి 30% వరకు పొదుపు చేసేలా ప్లాన్ చేసుకోండి. మీ పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడండి. దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వండి. మీకు 50 ఏళ్లు ఉంటే పదవీ విరమణకు దగ్గరగా ఉంటారు కాబట్టి మీకు ఎలాంటి అప్పులు లేకుండా చేసుకోండి. అలాగే, భవిష్యత్తులో వచ్చే ఖర్చులను ముందుగానే అంచనా వేయండి. పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయాన్ని సురక్షితంగా మార్చుకునే దిశగా అడుగులు వేయండి.
మీ పదవీ విరమణ తర్వాత వృద్ధాప్యంలో నిరంతర ఆదాయం కోసం అనువైన పథకాలను ఎంచుకోండి. ఆరోగ్య భద్రత కోసం మెరుగైన ఇన్సూరెన్స్ పాలసీలు ఉండేలా చూసుకోండి. పొదుపు అనేది కేవలం డబ్బును దాచడం కాదు. భవిష్యత్తును నిర్మించడానికి వేసే బలమైన పునాది. తగిన ప్రణాళికతో, సరైన పెట్టుబడి మార్గాలతో మీరు ఏ ఆర్థిక సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనవచ్చు. ఇప్పుడు తీసుకున్న చిన్న నిర్ణయాలు, రేపటి భద్రతకు కొండంత అండగా నిలుస్తాయి.
Also Read:
జీవితాంతం నెలకు 20,000 పొందాలనుకుంటున్నారా.. ఈ ప్లాన్‌ను తప్పక తెలుసుకోండి..
సెకండ్ హ్యాండ్ కారు కొనాలని అనుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
For More Lifestyle News
Updated Date - Jun 23 , 2025 | 03:57 PM