US Visa Interviews Rescheduled: భారత్‌కు వెళ్లొద్దు.. హెచ్-1బీ వీసాదారులకు ఇమిగ్రేషన్ లాయర్‌ల సూచన
ABN, Publish Date - Dec 11 , 2025 | 06:14 PM
భారత్‌లో వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడిన నేపథ్యంలో హెచ్-1బీ వీసాదారులకు అక్కడి ఇమిగ్రేషన్ లాయర్లు కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఇండియాకు వెళితే వీసా స్టాంపింగ్ ఆలస్యమై చిక్కుల్లో పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో డిసెంబర్‌లో జరగాల్సిన వీసా ఇంటర్వ్యూలను వచ్చే ఏడాదికి అమెరికా వాయిదా వేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఇంటర్వ్యూలు ఉండొచ్చంటూ ఇటీవల అకస్మాత్తుగా లబ్ధిదారులకు సందేశాలు పంపించింది. దీంతో, ఒక్కసారిగా కలకలం రేగింది. లబ్ధిదారుల సోషల్ మీడియా అకౌంట్స్ పరిశీలన నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. దీంతో, అమెరికాలోని హెచ్-1బీ వీసాదారులకు అక్కడి ఇమిగ్రేషన్ లాయర్లు కీలక సూచనలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కు వెళ్లడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు (US Visa Interviews Rescheduled).
హెచ్-1బీ వీసా కాలపరిమితి ఇంకా ముగియని వారు మాత్రమే తమ సొంత దేశాలకు వెళ్లి రావొచ్చని ఇమిగ్రేషన్ లాయర్స్ చెబుతున్నారు. హెచ్-1బీ వీసాదారులు తిరిగి అమెరికా వెళ్లాలంటే తమ సొంత దేశాల్లోని యూఎస్ కాన్సులార్ కార్యాలయాల ఆమోదముద్ర తప్పనిసరి. కాబట్టి ఇంటర్వ్యూలు వాయిదా పడిన ప్రస్తుత పరిస్థితుల్లో హెచ్-1బీ హోల్డర్స్ తమ సొంత దేశాల్లోనే ఉండిపోవాల్సి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. చివరకు అమెరికా జాబ్‌లో పోగొట్టుకునే అవకాశం ఉందని కూడా అన్నారు.
వలసల వ్యవహారాల న్యాయవాదుల ప్రకారం, హెచ్-1బీ ఉద్యోగాన్ని ఆరు నెలలకు మించి ఖాళీగా ఉంచే పరిస్థితి లేదు. ఈ కాలవ్యవధిని మించితే మరొకరితో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇక అమెరికా సంస్థలు విదేశాల్లోని వారికి వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించేందుకూ పరిమితులు ఉన్నాయి.
డిసెంబర్‌లో ఇంటర్వ్యూలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది హెచ్-1బీ వీసాదారులు భారత్‌కు వచ్చారు. కానీ ఆ ఇంటర్వ్యూలు వాయిదాపడ్డట్టు చివరి నిమిషంలో వాళ్లకు ఈమెయిల్స్ అందాయి. హెచ్-1బీ వీసాదారులు, వారి కుటుంబసభ్యుల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను కూడా పరిశీలించనున్నామని విదేశాంగ శాఖ గత వారం తెలిపింది. ఈ క్రమంలోనే డిసెంబర్‌లో జరగాల్సిన ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి.
ఇవీ చదవండి:
వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీపై అధ్యక్షుడు ట్రంప్ పొగడ్తలు.. ఆమె సూపర్ స్టార్ అంటూ..
మన దేశానికి రష్యా అధ్యక్షులెవరూ ఇందుకే రారు.. పాక్ జర్నలిస్టు ఆవేదన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 11 , 2025 | 07:22 PM