ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

US - Pakistan : పాక్ స్వాతంత్ర్య దినోత్సవాన అమెరికా బంపరాఫర్లు

ABN, Publish Date - Aug 14 , 2025 | 10:06 AM

కీలకమైన ఖనిజాలు, హైడ్రోకార్బన్‌ల రంగాలలో పాకిస్తాన్‌కు సహకరిస్తామని అమెరికా ప్రకటించింది. పాక్ స్వాతంత్ర్య దినోత్సవాన ఈ ఆఫరిచ్చింది. ఏదో ఒక రోజు ఇస్లామాబాద్.. న్యూఢిల్లీకి చమురును విక్రయించవచ్చని ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఊతమిచ్చేలా..

US to cooperate with Pakistan

ఇంటర్నెట్ డెస్క్ : అమెరికాలోని డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పాకిస్థాన్‌తో వాణిజ్య పరంగా మరింత ముందుకు వెళ్లాలని భావిస్తోంది. కీలకమైన ఖనిజాలు, హైడ్రోకార్బన్‌ల రంగాలలో పాకిస్తాన్‌తో తమ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. ఇతర అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఆర్థిక సహకారంపైనా దృష్టి సారించింది. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంపిన అభినందన సందేశంలో తమ ఉద్దేశాన్ని ప్రకటిస్తూ.. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.

అమెరికా, పాకిస్థాన్ దేశాల మధ్య నిరంతర సహకార ప్రాముఖ్యతను రూబియో తన ప్రకటనలో హైలైట్ చేశారు. 'ఆగస్టు 14న పాకిస్తాన్ ప్రజలు తమ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా అమెరికా తరపున నేను వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను' అని రూబియో చెప్పారు. యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ విడుదల చేసిన ప్రకటనలో ఈ మేరకు తమ అభిమతాన్ని వ్యక్తపరిచారు. కీలకమైన అంశాలలో, ముఖ్యంగా ఉగ్రవాద నిరోధం, వాణిజ్యంలో పాకిస్తాన్ అభిమతాన్ని కూడా ఆయన అంగీకరించారు. పాకిస్థాన్‌కు కీలకమైన ఖనిజాలు, హైడ్రోకార్బన్‌లు సహా వివిధ రంగాల్లో ఆర్థిక సహకారం అందించేందుకు, కొత్త రంగాలను అన్వేషించడానికి, డైనమిక్ వ్యాపార భాగస్వామ్యాలను పెంపొందించడానికి తాము ఎదురుచూస్తున్నామని రోబియో చెప్పుకొచ్చారు.

అంతేకాదు, ఇది అమెరికన్లు, పాకిస్తానీలకు సంపన్న భవిష్యత్తును రూపొందిస్తుంది అని రూబియో అన్నారు. కాగా, జూలై ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌తో వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు. పాకిస్థాన్ లో చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి సహకరిస్తామని, ఏదో ఒక రోజు ఇస్లామాబాద్.. న్యూఢిల్లీకి చమురును విక్రయించవచ్చని ట్రంప్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత రూబియో ప్రకటన దీనికి అనుగుణంగానే ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రజలకు భయం పోయింది.. జగన్‌కు పట్టుకుంది

జగన్‌కు దమ్ముంటే మోదీ, షాపై పోరాడాలి

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 10:06 AM