ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump Tariffs on India: భారత్‌పై సుంకాలు.. రష్యాకు పెద్ద దెబ్బ

ABN, Publish Date - Aug 13 , 2025 | 03:16 AM

రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌పై విధించిన టారి్‌ఫలతో రష్యాకు పెద్ద దెబ్బ తగిలిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ క్షీణదశలో ఉందని వ్యాఖ్యానించారు..

  • రష్యా ఆర్థిక వ్యవస్థ క్షీణ దశలో ఉంది

  • అమెరికా సుంకాలే కారణం: ట్రంప్‌

  • శుక్రవారం పుతిన్‌తో భేటీ

వాషింగ్టన్‌, ఆగస్టు 12: రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌పై విధించిన టారి్‌ఫలతో రష్యాకు పెద్ద దెబ్బ తగిలిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ క్షీణదశలో ఉందని వ్యాఖ్యానించారు. సోమవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఆయన వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘రష్యా ఒక పెద్ద దేశం. ఎంతో పురోగమించే సామర్థ్యం దానికి ఉంది. ఆ దేశం పునర్నిర్మాణంపై దృష్టిసారించుకోవాల్సి ఉంది. ఇప్పుడైతే రష్యా పరిస్థితి ఏమీ బాగోలేదు. అమెరికా ఆంక్షలే దానికి కారణం. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 50శాతం సుంకాలు విధించాం. అది రష్యాకు పెద్ద దెబ్బ..’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. శుక్రవారం అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం కానున్నట్టు తెలిపారు. రష్యాలోనో, మరో దేశంలోనో కలవకుండా.. అమెరికాలో తమ భేటీ జరగనుండటం గౌరవనీయమని పేర్కొన్నారు. తమ భేటీ తర్వాత యూరోపియన్‌ దేశాల నేతలతో మాట్లాడుతానని.. పుతిన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య చర్చలు జరిగేలా చూస్తానని తెలిపారు.

చైనాపై టారి్‌ఫలు 3 నెలలు వాయిదా

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందంటూ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించి, అందులో 25శాతాన్ని అమల్లోకి తెచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. భారత్‌కన్నా ఎక్కువగా రష్యా చమురు కొంటున్న చైనా విషయంలో మాత్రం మినహాయింపులు పెంచుకుంటూ వెళుతున్నారు. చైనాపై సుంకాలకు ఇచ్చిన మినహాయింపు గడువును మరో మూడు నెలలు అంటే నవంబర్‌ 10వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అలాస్కా.. రష్యాలో.. నోరుజారిన ట్రంప్‌!

అమెరికాలో వాయవ్య ప్రాంతంలో ఉన్న కీలక ప్రాంతం అలాస్కా. శుక్రవారం అక్కడే ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భేటీ జరగనుంది. ట్రంప్‌ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘పుతిన్‌తో చర్చల కోసం రష్యా వెళుతున్నా..’ అంటూ నోరుజారారు. దీనితో అమెరికాలో భాగమైన అలాస్కాను రష్యాగా పేర్కొనడం ఏమిటంటూ ట్రోలింగ్‌ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ల పట్టివేత.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి

రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిపివేత అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..

For More National News and Telugu News

Updated Date - Aug 13 , 2025 | 03:16 AM