Share News

Fake Currency India: గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ల పట్టివేత.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి

ABN , Publish Date - Aug 11 , 2025 | 05:20 PM

గత ఆర్థిక సంవత్సరం భారత్‌లో 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్లను గుర్తించామని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. సభికులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

Fake Currency India: గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ల పట్టివేత.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి
Fake Currency Notes India FY2025

ఇంటర్నెట్ డెస్క్: గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) మొత్తం 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా తాజాగా వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే (2.23 లక్షలు ఫేక్ నోట్లు) ఈ సారి వీటి సంఖ్య కొద్దిగా తగ్గిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు.

మంత్రి ప్రకటన ప్రకారం, 1,17,722 నకిలీ రూ.500 నోట్లు, 51,069 నకిలీ100 నోట్లు, 32,660 ఫేక్ 200 నోట్లను కేంద్రం స్వాధీనం చేసుకుంది. ఇతర డినామినేషన్‌ల ఫేక్ కరెన్సీ నోట్లు కూడా లభించాయి. ఈ మేరకు మంత్రి లోక్ సభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

ప్రభుత్వం, ఆర్‌బీఐతో కలిసి, నోట్ల భద్రతా ఫీచర్లను తరచుగా సమీక్షిస్తుంటుందని కేంద్ర మంత్రి పంకజ్ పేర్కొన్నారు. అవసరమైన సందర్భాల్లో నోట్లకు కొత్త భద్రతా ఫీచర్లు జోడిస్తామని తెలిపారు. ఆర్‌బీఐ యాక్ట్ సెక్షన్ 25 ప్రకారం ఈ చర్యలు తీసుకుంటామని వివరించారు. నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకు ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ అని కూడా వెల్లడించారు.


ఇక లోక్ సభ సభ్యలు అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ దేశంలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల స్థిర ఆస్తులు గత మూడు సంవత్సరాలుగా పెరుగుతున్నాయని అన్నారు. 2021–22 సంవత్సరంలో 7.6%, 2022–23లో 10.3%, 2023–24లో 10.2% మేర ఫిక్సడ్ అసెట్స్ పెరిగాయని తెలిపారు. ఇక బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు 2021–22 ఆర్థిక సంవత్సరంలో 401 ప్రాజెక్టులను ఆమోదించగా, 2023–24 నాటికి ఈ సంఖ్య 944కి పెరిగిందని మంత్రి అన్నారు. మొత్తం ప్రాజెక్ట్‌ల వ్యయం ₹1.4 లక్షల కోట్ల నుండి ₹3.9 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు.

ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా మూలధన వ్యయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక రంగ సంస్కరణలు, వ్యాపార నిర్వహణ సులభతరం చేయడంపై దృష్టి సారించామని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిపివేత అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..

ఈ-ఆధార్ యాప్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం

For More National News and Telugu News

Updated Date - Aug 11 , 2025 | 05:34 PM