Indian fighting for Russia: రష్యా సైన్యంలో భారతీయుడు.. ఉక్రెయిన్ దళాలకు చిక్కిన గుజరాతీ..
ABN, Publish Date - Oct 08 , 2025 | 10:24 AM
ఎన్నో ఏళ్లుగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటికే ఎంతో మంది సైనికులు చనిపోయారు. రష్యాకు మద్దతుగా ఈ యుద్ధంలో పోరాడుతున్న ఓ భారతీయ యువకుడిని ఉక్రెయిన్ దళాలు తాజాగా పట్టుకున్నాయి.
ఎన్నో ఏళ్లుగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటికే ఎంతో మంది సైనికులు చనిపోయారు. రష్యాకు మద్దతుగా ఈ యుద్ధంలో పోరాడుతున్న ఓ భారతీయ యువకుడిని ఉక్రెయిన్ దళాలు తాజాగా పట్టుకున్నాయి. 22 ఏళ్ల ఈ యువకుడు గుజరాత్‌లోని మోర్బి నివాసి సాహిల్ మొహమ్మద్ అని గుర్తించారు. అయితే ఈ విషయాన్ని కీవ్‌లోని భారతీయ ఎంబసీ ఇంకా ధ్రువీకరించలేదు (Indian man captured Ukraine).
మొహమ్మద్ మొదట్లో రష్యాకు చదువుకోడానికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రష్యాలోని మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ కావడంతో అతడికి కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆ శిక్ష నుంచి తప్పించుకునేందుకు మొహమ్మద్ యుద్ధంలోకి దిగినట్టు ఉక్రెయిన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్ బ్రిగేడ్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో ఆ విషయాన్ని మొహమ్మద్ ధ్రువీకరించాడు. జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకే తాను యుద్ధంలోకి వచ్చినట్టు మొహమ్మద్ రష్యన్ భాషలో చెబుతున్నాడు (Ukraine Russia war news).
యుద్ధ రంగంలోకి వచ్చే ముందు తాను కేవలం 16 రోజుల శిక్షణ మాత్రమే పొందానని, కమాండర్‌తో విభేదాల తర్వాత లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని మొహమ్మద్ పేర్కొన్నాడు (Ukraine war Indian involvement). కాగా, అధికారిక గణాంకాల ప్రకారం 2022 నుంచి ఇప్పటివరకు 150 మందికి పైగా భారతీయులు రష్యా తరఫున ఉక్రెయిన్‌తో పోరాటంలోకి దిగారు. ఇప్పటివరకు ఈ యుద్ధంలో సుమారు 12 మంది భారతీయులు మరణించినట్టు సమాచారం. 96 మంది భారతీయులను రష్యా అధికారులు విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 08 , 2025 | 12:03 PM