Trump H-1B visa cards: హెచ్1బీ ఉద్యోగులకు ట్రంప్ గోల్డ్, ప్లాటినం, కార్పొరేట్ గోల్డ్ కార్డులు.. ఏమిటివి?
ABN, Publish Date - Sep 20 , 2025 | 12:09 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉద్యోగులపై బాంబ్ వేశారు. హెచ్1బీ వీసా వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచారు. ఈ నిర్ణయం అమెరికాలోని పలు టెక్ కంపెనీల్లో పని చేస్తున్న భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉద్యోగులపై బాంబ్ వేశారు. హెచ్1బీ వీసా వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచారు. ఈ నిర్ణయం అమెరికాలోని పలు టెక్ కంపెనీల్లో పని చేస్తున్న భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికన్ ఉద్యోగులను రక్షించడమే ఈ చర్య లక్ష్యం అని ట్రంప్ పరిపాలనా విభాగం తెలియజేసింది. ఈ చర్యలు చట్టబద్ధంగా అమలులోకి వస్తే భారతీయులను నియమించుకునే కంపెనీలు ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది (Trump H-1B visa cards).
కాగా, విదేశీ ఉద్యోగుల కోసం అమెరికా ప్రభుత్వం గోల్డ్ కార్డ్ వీసా కార్యక్రమాన్ని ప్రకటించింది. ట్రంప్ గోల్డ్ కార్డ్, ట్రంప్ ప్లాటినం కార్డ్, వ్యాపారస్తులకు ట్రంప్ కార్పొరేట్ గోల్డ్ కార్డ్ ఇస్తారు. ఈ కార్డులు ప్రత్యేకమైన అధికారాలను అందిస్తాయి. ఈ కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. (Gold card H-1B)
ట్రంప్ గోల్డ్ కార్డ్: ఈ కార్డ్ పొందాలంటే 10 లక్షల డాలర్లు (దాదాపు 8.8 కోట్ల రూపాయలు) చెల్లించాలి. ఈ కార్డ్ పొందాలనుకునే వారు నాన్-రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజ్‌తో పాటు అప్లికేషన్‌ను సమర్పించాలి. ఈ గోల్డ్ కార్డ్ పొందితే అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలో ఎక్కడికైనా వెళ్లి ఉపయోగించుకోవచ్చు.
ట్రంప్ ప్లాటినమ్ కార్డ్: ఈ కార్డ్ పొందాలంటే 50 లక్షల డాలర్లు (దాదాపు 44 కోట్ల రూపాయలు) చెల్లించాలి. ఈ కార్డ్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియం ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఒక వ్యక్తి ఈ ప్లాటినమ్ కార్డ్ కోసం సైన్ అప్ చేసి వెయిటింగ్ లిస్ట్‌లో తన స్థానాన్ని పొందవలసి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ పరిశీలన కోసం వేచి ఉండాలి. ఈ కార్డు వస్తే అమెరికాలో 270 రోజుల వరకు ఇతర దేశాల్లో సంపాదించే ఆదాయంపై పన్ను కట్టకుండా గడపవచ్చు (Platinum H-1B visa).
ట్రంప్ కార్పొరేట్ గోల్డ్ కార్డ్ (Corporate Gold visa): విదేశీ ఉద్యోగులను నియమించుకునే కంపెనీలు ఈ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ కార్డ్ కోసం కార్పొరేట్ కంపెనీలు 20 లక్షల డాలర్లు (17 కోట్ల రూపాయలు) చెల్లించాలి. ప్రాసెసింగ్ రుసుము చెల్లించి డీహెచ్‌ఎస్ పరిశీలన కోసం వేచి ఉండాలి. స్వల్ప వార్షిక నిర్వహణ రుసుము కూడా వర్తిస్తుంది.
ఇవి కూడా చదవండి:
చాబహార్ పోర్టుపై భారత్‌కు ఇచ్చిన మినహాయింపులు రద్దు.. అమెరికా నిర్ణయం
అమెరికా చట్టసభల భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 20 , 2025 | 12:27 PM