Share News

Trump Golden Statue: అమెరికా చట్టసభల భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం..

ABN , Publish Date - Sep 18 , 2025 | 11:28 AM

అమెరికా చట్టసభల భవనం క్యాపిటల్ ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం ఏర్పాటు చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ట్రంప్ తన చేతిలో క్రిప్టో కరెన్సీ పట్టుకున్న ఆకారంలో ఈ విగ్రహాన్ని రూపొందించారు.

Trump Golden Statue: అమెరికా చట్టసభల భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం..
Trump Bitcoin statue

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా చట్టసభల భవనం క్యాపిటల్ ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం ఏర్పాటుపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి రేగుతోంది. కొందరు ఈ చర్యపై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు (golden Trump statue US Capitol).

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ట్రంప్ చేతిలో క్రిప్టో కరెన్సీ ఉన్నట్టు 12 అడుగుల ఎత్తు ఉండేలా ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. దీని కోసం క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులు నిధులు సమకూర్చారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటును 25 బేస్ పాయింట్ల మేర తగ్గించిన నేపథ్యంలో విగ్రహం ఏర్పాటు ఆసక్తికరంగా మారింది. దీన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు (Trump Bitcoin statue).


డిజిటల్ కరెన్సీ భవిష్యత్తు, రిజర్వ్ బ్యాంకుల విత్త విధానాలు, ఆర్థిక రంగ మార్కెట్‌లో ప్రభుత్వం పాత్ర తదితర అంశాలపై జనాల్లో అవగాహన, చర్చను ప్రారంభించేందుకు ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్టు క్రిప్టో ఇన్వెస్టర్లు కొందరు పేర్కొన్నారు. ఈ విగ్రహం చిత్రాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. క్రిప్టో అనుకూల విధానాలను అవలంబిస్తున్న ట్రంప్‌ను కొందరు ప్రశంసించారు (Fed rate cut reaction).

ఇక వడ్డీ రేట్లల్లో కొత పెట్టాలంటూ అమెరికా ఫెడరల్ రిజర్వ్‌పై ట్రంప్ ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లో కోత విధించింది. మరో రెండు పర్యాయాలు వడ్డీ రేటును తగ్గించే యోచనలో ఉన్నట్టు కూడా పేర్కొంది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రాధాన్యమిస్తూ వచ్చిన ఫెడరల్ రిజర్వ్ ఇకపై తన దృష్టిని ఉద్యోగాల పెంపుపై మళ్లించినట్టు వెల్లడించింది. అమెరికాలో ఓవైపు ద్రవ్యోల్బణం పెరుగుతుంటే మరోవైపు ఉద్యోగాల సృష్టి రేటు కూడా నెమ్మదిస్తోందని ఫెడరల్ రిజర్వ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ రెస్పాన్స్ ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఇవి కూడా చదవండి:

అమెరికాలో జిమ్మీ కిమ్మెల్ లైవ్ షో నిలిపివేత.. దేశానికి ఇది శుభవార్త అన్న ట్రంప్

అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు పోలీసుల మృతి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం

Updated Date - Sep 18 , 2025 | 12:11 PM