Share News

Jimmy Kimmel: అమెరికాలో జిమ్మీ కిమ్మెల్ లైవ్ షో నిలిపివేత.. దేశానికి ఇది శుభవార్త అన్న ట్రంప్

ABN , Publish Date - Sep 18 , 2025 | 09:58 AM

అమెరికాలో ప్రముఖ టీవీ షో జిమ్మీ కిమ్మెల్ లైవ్‌ ప్రసారం నిలిచిపోయింది. కిర్క్ హత్య గురించి షో వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్ అభ్యంతరకర కామెంట్స్ చేసిన నేపథ్యంలో షో ప్రసారాన్ని నిలిపివేస్తున్నట్టు ఏబీసీ టీవీ సంస్థ ప్రకటించింది.

Jimmy Kimmel: అమెరికాలో జిమ్మీ కిమ్మెల్ లైవ్ షో నిలిపివేత.. దేశానికి ఇది శుభవార్త అన్న ట్రంప్
Jimmy Kimmel Charlie Kirk remark

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో మరో పాప్యులర్ టాక్ షోపై వేటు పడింది. జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతగా ఉన్న టాక్ షోను నిలిపివేస్తున్నట్టు ఏబీసీ టీవీ సంస్థ తాజాగా పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యోదంతంపై వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు షోను నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. ఏబీసీ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హర్షం వ్యక్తం చేశారు. ఇది అమెరికాకు ఒక శుభవార్త అని కామెంట్ చేశారు (Jimmy Kimmel Show Suspended).

సెప్టెంబర్ 10న కిర్క్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ అంశంపై తన పాప్యులర్ లేట్ నైట్ షోలో కిమ్మెల్ మాట్లాడారు. కిర్క్ హత్య నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కిర్క్‌ను హత్య చేసిన వ్యక్తి.. ట్రంప్ మద్దతుదారులైన మాగా గ్యాంగ్‌కు చెందిన వాడే అని అన్నారు (MAGA Gang Statement).


కిర్క్ విషయంలో ట్రంప్ సంఘీభావం ప్రకటించిన తీరును కూడా కిమ్మెల్ విమర్శించారు. ట్రంప్ సంఘీభావ ప్రకటన వీడియోను తన షోలో చూపించారు. ఓవైపు సంఘీభావం ప్రకటిస్తూనే మరోవైపు ట్రంప్ శ్వేతసౌధంలో కొత్తగా చేపడుతున్న నిర్మాణాల గురించి మాట్లాడినట్టు వీడియోలో కనిపించింది. దీన్ని ప్రస్తావిస్తూ కిమ్మెల్ విమర్శలు ఎక్కుపెట్టారు. మరో ఛానల్‌లో కూడా ట్రంప్ కిర్క్ హత్య గురించి మాట్లాడుతూ శ్వేత సౌధం బాల్ రూమ్ నిర్మాణం గురించి ప్రస్తావించిన వీడియోను కూడా కిమ్మెల్ షేర్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్యాష్ పటేల్‌పై కూడా కిమ్మెల్ విమర్శలు గుప్పించారు (Jimmy Kimmel Live Suspended).

ఈ అంశంపై వివాదం రేగడంతో ఏబీసీ సంస్థ షేర్ హోల్డర్‌లలో ఒకరైన నెక్స్‌స్టార్ సంచలన ప్రకటన చేసింది. జిమ్మీ కిమ్మెల్ షోను ఇకపై ప్రసారం చేయబోమని పేర్కొంది. కిమ్మెల్ కామెంట్స్ అభ్యంతరకరమని వ్యాఖ్యానించింది. ఈ సున్నిత సమయంలో ఇలాంటి కామెంట్స్ చేసుండాల్సింది కాదని అభిప్రాయపడింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ విధానాల విమర్శకుల్లో జిమ్మీ కిమ్మెల్ కూడా ఒకరు. గతంలో మరో టీవీ షో వ్యాఖ్యాత స్టీవెన్ కోబేర్ షో కూడా దాదాపు ఇలాగే రద్దైన విషయం తెలిసిందే. ఇదే తమ చివరి సీజన్ అని షో ప్రొడ్యూసర్లు అప్పట్లో ప్రకటించారు.


ఇవి కూడా చదవండి:

అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు పోలీసుల మృతి

భారత్‌తో మా బంధాన్ని తెంచేందుకు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి: రష్యా విదేశాంగ శాఖ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం

Updated Date - Sep 18 , 2025 | 10:16 AM