ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump-Putin Meeting: అలాస్కాలో ట్రంప్ – పుతిన్ కీలక భేటీ..పుతిన్ ఆశలేంటి, చర్చలు సఫలమవుతాయా

ABN, Publish Date - Aug 14 , 2025 | 07:41 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు ఆగస్టు 15న అలాస్కాలో స్పెషల్ మీటింగ్‌లో కలువనున్నారు. ఈ సమావేశం చాలా కీలకం, ఎందుకంటే ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే దిశగా ఒక కీలక నిర్ణయం కావచ్చు. ఈ భేటీలో ఏం జరగబోతోంది? పుతిన్ ఏం కోరుకుంటున్నారనే విషయాలను ఇక్కడ చూద్దాం.

trump putin meeting update

అలాస్కాలో జ‌ర‌గ‌బోతున్న ట్రంప్ – పుతిన్ భేటీ (Trump-Putin Meeting) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ర‌ష్యా – ఉక్రెయిన్ యుద్ధం ముగిసేందుకు ఇది ఒక కీల‌క ఘ‌ట్టంగా ప‌రిగ‌ణించ‌బడుతోంది. కానీ ఈ భేటీలో పుతిన్ ఏం కోరుకుంటున్నాడు? ట్రంప్ నిజంగా శాంతిని కోరుతున్నాడా? ఈ చ‌ర్చ‌లు ఎంత వరకు సఫల‌మ‌వ‌తాయ‌నే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పుతిన్ డిమాండ్స్ ఏంటి?

ఈ చ‌ర్చ‌ల వెనుక పుతిన్ ఆశ‌లు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ నియంత్ర‌ణ‌లో ఉన్న డొనెట్స్క్ ప్రాంతంలోని మిగిలిన 30 శాతం భూభాగాన్ని ఉక్రెయిన్ ఖాళీ చేయాల‌ని ర‌ష్యా డిమాండ్ చేస్తోంది. ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్స్కీ ఈ ప్రతిపాదనను క‌ఠినంగా తిరస్కరించారు. ఇది ఎప్ప‌టికీ సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.

ఉక్రెయిన్‌కు అవకాశం లేదా?

ఇంత ముఖ్యమైన చర్చల్లో ఉక్రెయిన్‌కు స్థానం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ భేటీలో ఉక్రెయిన్ హాజరు కావడం లేదు. వాస్త‌వానికి ఇది ర‌ష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై చ‌ర్చ కావ‌డంతో, ఇద్ద‌రు దేశాలూ ఉన్న‌త‌ స్థాయిలో పాల్గొనాలి అనేది సాధార‌ణ అభిప్రాయం. కానీ పుతిన్ ఏమి చెబుతాడో వినేందుకు మాత్రమే ఈ సమావేశానికి హాజరవుతున్నారని ట్రంప్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అంటే ఈ భేటీతో ఈ వివాదం పూర్తిగా తొలగిపోయేలా కనిపించడం లేదు.

ట్రంప్ బెదిరింపు.. వెంట‌నే ఆంక్షల సడలింపు

ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్, ర‌ష్యాను హెచ్చ‌రించారు. ఉక్రెయిన్‌లో శాంతి ప్రక్రియను అడ్డుకుంటే తీవ్ర ఫలితాలు ఎదురవుతాయ‌ని తెలిపారు. కానీ ఈ హెచ్చ‌రికల వాతావ‌ర‌ణం తర్వాత కొన్ని గంట‌ల్లోనే ట్రంప్ త‌న వైఖ‌రిని మార్చుకున్నారు. ర‌ష్యాపై ఉన్న కొన్ని ఆంక్ష‌ల‌ను తాత్కాలికంగా ఎత్తివేశారు. ఈ నిర్ణ‌యం శుక్ర‌వారం అలాస్కాలో జ‌రిగే భేటికి మార్గం సుగ‌మం చేయాల‌నే ఉద్దేశ్యంతో తీసుకున్న‌ట్లు భావిస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో ప్రవేశించేందుకు నిషేధించబడిన రష్యన్ అధికారులు ఈ సమావేశం కోసం స్పెషల్ అనుమతులు పొందారు.

శాంతికి మద్దతా? వ్యాపారానికి ప్రాధాన్యతా?

ట్రంప్ చర్యలతో ఆయన వ్యూహం స్పష్టంగా అర్థం కావడం లేదు. ఒకవైపు కఠినంగా హెచ్చ‌రిస్తారు, మరొకవైపు ఆంక్షలు ఎత్తేస్తారు. ఇది శాంతికి మార్గం వేసే ప్ర‌య‌త్న‌మా? లేకపోతే వ్యాపార, రాజకీయ లాభాల కోసం తాత్కాలిక నాటకమా? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే, త‌న ప‌రిస్థితిని బలోపేతం చేసుకోవడానికి పుతిన్ ఈ చ‌ర్చ‌ల‌ను వేదిక‌గా మ‌ల‌చుకోవ‌చ్చ‌ని రాజకీయ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఉక్రెయిన్ మాత్రం స్ప‌ష్టంగా త‌న ధోరణిని తెలిపింది. కానీ ఉక్రెయిన్ లేకుండా ఈ చర్చలు పూర్తవుతాయా? కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందా? అన్నది సందేహంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 07:42 AM