ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Elon Musk vs Trump: ఎలాన్ మస్క్‌తో వివాదం.. ట్రంప్ సంచలన నిర్ణయం..

ABN, Publish Date - Jun 07 , 2025 | 09:16 PM

ఒకప్పటి అభిమానం, ఇప్పుడు వివాదంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా (Elon Musk vs Trump) సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో టెస్లాకు సపోర్టుగా గతంలో ట్రంప్ కొనుగోలు చేసిన రెడ్ కలర్ కారును అమ్మివేయనున్నట్లు తెలుస్తోంది.

Trump Sells Red Tesla reports

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య (Elon Musk vs Trump) విభేదాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ గతంలో ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీకి సపోర్ట్ చేస్తూ రెడ్ కలర్ మోడల్ ఎస్ కారు కొనుగోలు చేశారు. ఈ చర్య తర్వాత తాజాగా మస్క్, ట్రంప్ మధ్య వివాదాలు పెరిగిపోయాయి. ట్రంప్, మస్క్ మధ్య స్నేహం ప్రారంభంలో బలంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ విధానాలపై మస్క్ విమర్శలు, ప్రత్యేకంగా బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే చట్టంపై వ్యతిరేకత, వారి సంబంధాన్ని తగ్గించాయి.


ట్రంప్ విమర్శలు

ఈ విమర్శలకు ట్రంప్ ప్రతిస్పందనగా మస్క్ తో ఉన్న ప్రభుత్వ ఒప్పందాలను రద్దు చేయాలని సూచించారు. ఈ పరిణామాలు టెస్లా షేర్ల విలువను తగ్గించాయి. దీంతో మస్క్ నెట్ వర్త్ $34 బిలియన్ల మేర తగ్గింది. మస్క్ స్పందిస్తూ స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను డీకమీషన్ చేయాలని ప్రకటించారు. డ్రాగన్, నాసా అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములు, సరుకులను రవాణా చేసే అమెరికన్ వాహనం అది. అయితే, కొన్ని గంటల తర్వాత మస్క్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.


రాజకీయ, ఆర్థిక పరిణామాలు

మస్క్ 2024 ఎన్నికల్లో ట్రంప్‌నకు సుమారు $275 మిలియన్ల మేర సపోర్ట్ చేశారు. ఈ విభేదాల కారణంగా, మస్క్ తన మద్దతు కొనసాగించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, మస్క్ అమెరికా పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీ స్థాపించాలనే ఆలోచననూ వ్యక్తం చేశారు. ఇది ట్రంప్‌నకు ప్రత్యామ్నాయంగా ఉండే ఛాన్సుంది.


రెడ్ టెస్లా సేల్

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ట్రంప్ తన రెడ్ టెస్లా మోడల్ ఎస్‌ను విక్రయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వాహనం వైట్ హౌస్ వద్ద పార్క్ చేయబడింది. కానీ దీని గురించి ఇంకా అధికారికంగా నిర్ణయించబడలేదు.


ఇవీ చదవండి:

మీ పాన్ కార్డ్ యాక్టివ్‌లో ఉందా లేదా.. లేదంటే రూ.10 వేల పైన్

4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 07 , 2025 | 10:00 PM