ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: రష్యాపై దూకుడు.. ట్రంప్ మళ్లీ యూటర్న్

ABN, Publish Date - Aug 06 , 2025 | 11:19 AM

మాస్కో నుంచి యురేనియం, ఎరువులను వాషింగ్టన్ దిగుమతి చేసుకుంటున్న విషయంపై తనకు అవగాహన లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ చెప్పారు. ఆ విషయం తెలుసుకుంటానని అన్నారు.

Donald Trump

లాస్ ఏంజిల్స్: రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తే భారత్‌పై సుంకాల బాదుడు మరింత పెంచుతామంటూ హెచ్చరికలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ మాట మార్చారు. సౌర్వభౌమాధికారం కలిగిన దేశాలపై జులుం తగదని భారత్‌కు రష్యా బాసటగా నిలవడంతో ట్రంప్ మరోసారి సుంకాల విషయంలో స్పందించారు. అలాంటి శాతాలేవీ తాను చెప్పలేదన్నారు. మాస్కో నుంచి వాషింగ్టన్ యురేనియం, ఎరువులు దిగుమతి చేసుకుంటున్న విషయంపై మీడియా సూటిగా అడిగిన ప్రశ్నకు దానిపై తనకు అవగాహన లేదంటూ దాట వేశారు. దిగుమతుల విషయం తెలుసుకుంటానని చెప్పారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామంటూ చేసిన వ్యాఖ్యలపై వైట్ హౌస్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రశ్నించినప్పుడు 'పెర్సంటేజ్ మాట నేను ఎప్పుడూ చెప్పలేదు. దానిపై కసరత్తు చేస్తున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం' అంటూ ట్రంప్ మాట మార్చారు. రేపు రష్యాతో సమావేశం ఉంటుందని, ఏం జరుగుతుందో చూడాలని అన్నారు. మాస్కో నుంచి యురేనియం, ఎరువులను వాషింగ్టన్ దిగుమతి చేసుకుంటున్న విషయంపై తనకు అవగాహన లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ విషయం తెలుసుకుంటానని అన్నారు.

ట్రంప్‌‌కు భారత్ ఘాటు స్పందన

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపకపోతే ఇండియా దిగుమతులపై ప్రస్తుతం విధిస్తున్న 25 శాతం సుంకాన్ని మరో 24 గంటల్లో గణనీయంగా పెంచుతామని ట్రంప్ రెండ్రోజుల క్రితం హెచ్చరించారు. దీనికి భారత్ దీటుగా జవాబిచ్చింది. న్యాయసమ్మతం, హేతుబద్ధం కాని చర్యగా దీనిని పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభం కావడంతో సంప్రదాయిక సరఫరాలు యూరప్‌కు మళ్లించిన కారణంగా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నట్టు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా సుంకాలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ సైతం గతవారం పార్లమెంటులో వివరణ ఇచ్చారు. భారత దేశ ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి..

ట్రంప్ హెచ్చరికల వేళ రష్యాలో అజిత్ డోభాల్

భారత్‌పై మరిన్ని సుంకాలు

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 06 , 2025 | 01:26 PM