ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Barack Obama: ఒబామాను కారులో వెంటాడుతూ!

ABN, Publish Date - Jul 28 , 2025 | 05:49 AM

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఓ తెలుపు రంగు ఫోర్డ్‌ బ్రాంకో కారులో దూసుకెళ్తున్నారు..

  • పోలీసులతో కలిసి చేజింగ్‌ చేస్తున్నట్టుగా మీమ్‌ ఫొటో పోస్టు చేసిన ట్రంప్‌

వాషింగ్టన్‌, జూలై 27: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఓ తెలుపు రంగు ఫోర్డ్‌ బ్రాంకో కారులో దూసుకెళ్తున్నారు.. ఆయనను పట్టుకునేందుకు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, పోలీసులు కార్లలో చేజ్‌ చేస్తున్నారు..! ఒబామాను టార్గెట్‌ చేస్తూ ట్రంప్‌ పోస్టు చేసిన తాజా మీమ్‌ ఫొటో ఇది. అమెరికాలో తన మాజీ భార్యను, మరొకరిని హత్య చేసిన కేసులో నిందితుడైన ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు, హాలీవుడ్‌ నటుడు ఓజే సింప్సన్‌.. ఫోర్డ్‌ బ్రాంకో కారులో పారిపోతుండగా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు.

1994 జూన్‌17న సుదీర్ఘం గాసాగిన ఆ చేజింగ్‌ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడా దృశ్యాన్ని వినియోగించి రూపొందించిన మీమ్‌ను ట్రంప్‌ పోస్టు చేశారు. ఇంతకుముందు అమెరికా అధ్యక్ష కార్యాలయంలో ట్రంప్‌, ఒబామా కూర్చుని మాట్లాడుతుంటే.. పోలీసులు వచ్చి ఒబామాను అరెస్టుచేసి జైలులో పెట్టినట్టుగా ఉన్న ఏఐ వీడియోను ట్రంప్‌ పోస్టు చేశారు.

Updated Date - Jul 28 , 2025 | 05:49 AM