ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump H-1B visa fee: లక్ష డాలర్లు కడితేనే అడుగుపెట్టండి.. ట్రంప్ వింత కండీషన్..

ABN, Publish Date - Sep 20 , 2025 | 06:53 AM

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి భారత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారీ పన్నులతో భారత ఎగుమతులను దెబ్బకొట్టిన ట్రంప్.. తాజాగా అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు గట్టి షాకిచ్చారు.

Trump H-1B visa fee

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎన్నికైన నాటి నుంచి భారత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారీ పన్నులతో భారత ఎగుమతులను దెబ్బకొట్టిన ట్రంప్.. తాజాగా అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు గట్టి షాకిచ్చారు. హెచ్1బీ వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచేశారు. హెచ్1బీ వీసా వార్షిక రుసుమును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై శుక్రవారం సంతకం చేశారు ($100K H-1B visa).

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం చూపనుంది (H-1B changes). ఈ ఉత్తర్వు ప్రకారం ఇకపై అమెరికా వేదికగా పని చేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవాలంటే ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాలి. అమెరికాలో హెచ్1బీ వీసాపై పని చేస్తున్న విదేశీ ఉద్యోగుల్లో దాదాపు 71 శాతం మంది భారతీయులే ఉంటారు. చైనీయులు 11.7 శాతం మంది ఉంటారు. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను నియమించుకునే వీలు కల్పిస్తూ 1990లో హెచ్‌1బీ వీసాను తీసుకొచ్చారు (US work visa fee).

ఈ వీసాను ఉపయోగించుకుని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించారు (H-1B crackdown). హెచ్1బీ వీసాదారులకు లాటరీ విధానం ఉంది. ఈ వీసా కోసం అప్లై చేసేందుకు ముందుగా సాధారణ ఛార్జీలు చెల్లించాలి. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. ఏడాదికి 85 వేల వీసాలను అమెరికా లాటరీ విధానం ద్వారా జారీ చేస్తుంది. సాధారణంగా కంపెనీలే ఉద్యోగుల హెచ్‌1బీ వీసా ఛార్జీలను చెల్లిస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఆ ఫీజును భారీగా పెంచేయడంతో కంపెనీలు పెను భారాన్ని ఎదుర్కోక తప్పదు.

ఇవి కూడా చదవండి:

చాబహార్ పోర్టుపై భారత్‌కు ఇచ్చిన మినహాయింపులు రద్దు.. అమెరికా నిర్ణయం

అమెరికా చట్టసభల భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 20 , 2025 | 12:05 PM