Trump Charlie Kirk: చార్లీ కిర్క్ హత్యపై ట్రంప్ ఆగ్రహం.. రాడికల్ లెఫ్ట్‌పై ఆరోపణలు
ABN, Publish Date - Sep 11 , 2025 | 07:58 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ట్రూత్ సోషల్‌లో ఒక వీడియో స్టేట్‌మెంట్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్లీ కిర్క్ హత్య ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతితో స్పందించి ఈ దుర్మరణం వెనుక రాడికల్ లెఫ్ట్ ఉందని ఆరోపించారు.
అమెరికాలో ప్రముఖ కన్సర్వేటివ్ యాక్టివిస్ట్, యువతలో సూపర్ పాపులర్ అయిన చార్లీ కిర్క్ (31) (Charlie Kirk) బుధవారం (సెప్టెంబర్ 10) హత్యకు గురయ్యారు. యూటా వ్యాలీ యూనివర్సిటీ (UVU)లో స్టూడెంట్స్‌తో సెషన్‌లో ఉండగా, మధ్యాహ్నం 12:20 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) ట్రూత్ సోషల్‌లో ఓ వీడియో స్టేట్‌మెంట్ షేర్ చేశారు. అందులో ఆయన చాలా బాధ, ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు. చార్లీ కిర్క్ హత్య దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.
ట్రంప్ హెచ్చరిక
ట్రంప్ ఈ హత్య వెనుక రాడికల్ లెఫ్ట్ హస్తం ఉందని గట్టిగా ఆరోపించారు. వాళ్లు చార్లీ లాంటి వాళ్లను నీచంగా మాట్లాడటం, నాజీలతో పోల్చడం వల్లే ఇలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు వెంటనే ఆగాలని ఆయన హెచ్చరించారు. ఈ హత్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ, దీన్ని సమర్థించే సంస్థలనూ శిక్షిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
మా అడ్మినిస్ట్రేషన్ ఈ హింసకు కారణమైన వాళ్లను వదిలిపెట్టదన్నారు. రాడికల్ లెఫ్ట్ వల్ల ఎంతో మంది అమాయకులు బాధపడ్డారని ఆయన అన్నారు. గతంలో పెన్సిల్వేనియాలో తనపై జరిగిన హత్యాయత్నం, ICE ఏజెంట్లపై దాడులను కూడా ట్రంప్ ఉదాహరణగా చెప్పారు.
చార్లీ కిర్క్ ఎవరు?
చార్లీ కిర్క్ పొలిటికల్ యాక్టివిస్ట్. యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు, దేశభక్తిని, స్వేచ్ఛా భావాలను ప్రోత్సహించేందుకు ఆయన కృషి చేసేవారు. క్యాంపస్‌లలో విద్యార్థులతో ఓపెన్ డిబేట్‌లు చేసేవారు. ఆయన హాస్యం, లాజిక్, క్లారిటీతో తన ఆలోచనల్ని అందరితో పంచుకునేవారు. చార్లీ ఒక దేశభక్తుడు. చార్లీకి భార్య ఎరికా, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ల కుటుంబానికి ఈ బాధను తట్టుకునే శక్తిని ఇవ్వాలని ట్రంప్ ప్రార్థించారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 11 , 2025 | 08:35 AM