ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: మస్క్‌పై తొలిసారిగా ట్రంప్ బహిరంగ విమర్శలు

ABN, Publish Date - Jun 05 , 2025 | 11:01 PM

మస్క్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా బహిరంగ విమర్శలు చేశారు., తాను తీసుకొచ్చిన బిల్లును మస్క్ విమర్శించడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు.

Trump Musk fallout

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్, టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ మధ్య స్నేహబంధం బీటలు వారింది. ట్రంప్ తాజాగా చేసిన వాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన భారీ ముసాయిదా చట్టంపై మస్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కామెంట్స్‌పై డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. మస్క్ కామెంట్స్ తనను ఆశ్చర్యపరిచాయని అన్నారు. ‘మా మధ్య బంధం అద్భుతంగా ఉండింది. కానీ ఇకపై అలా ఉంటుందని అనుకోను’ అని ఓవల్ ఆఫీసులో మీడియాను ఉద్దేశించి ట్రంప్ అన్నారు.


తన ఆర్థిక విధానాలకు ప్రతిబింబంగా ఉన్న ఈ ముసాయిదా బిల్లుతో ట్రంప్ అమెరికా కంపెనీలకు పలు రాయతీలు ప్రకటించారు. స్థానికంగా తయారీని ప్రోత్సహించేలా పన్ను రాయితీలు ప్రకటించారు. పలు సరళీకరణ చర్యలను కూడా పేర్కొన్నారు. ఈ బిల్లుకు ట్రంప్ సొంత పార్టీతో పాటు వాల్‌స్ట్రీట్ (స్టాక్ మార్కెట్ వర్గాలు) నుంచి భారీ మద్దతు లభించింది.

అయితే, మస్క్ మాత్రం ఈ బిల్లు పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. అడ్డు అదుపులేని రాయతీలు సృజనాత్మకతకు గొడ్డలి పెట్టు అని అన్నారు. సోషల్ మీడియాలో మస్క్ అలా కామెంట్ చేసిన తరువాత తామిద్దరం మళ్లీ మాట్లాడుకోలేదని ట్రంప్ తెలిపారు. ‘ఆ బిల్లులోని ప్రతి అంశం గురించి మస్క్‌కు తెలుసు. మిగతా అందరికంటే మస్క్‌కే బిల్లుపై ఎక్కువ అవగాహన ఉంది. కానీ డోజ్ నుంచి తప్పుకున్నాకే బిల్లులో సమస్యల గురించి మస్క్ చెబుతున్నారు. నేనెప్పుడూ మస్క్‌కు మద్దతుగానే ఉన్నా. స్పేస్ ఎక్స్ టెస్లాకు అండగా ఉన్నా. అవి అద్భుతమైన సంస్థలు. అమెరికా విధానాలతో ఇంతగా లాభపడ్డ వ్యక్తి యూటర్న్ తీసుకుని పరిశ్రమలకు మేలు చేకూర్చే బిల్లును విమర్శించడం ఏంటో అర్ధం కావట్లేదు’ అని ట్రంప్ అన్నారు.


ఇప్పటివరకూ మస్క్ తనను నేరుగా విమర్శించకపోయినప్పటికీ భవిష్యత్తులో మార్పు రావొచ్చని కూడా ట్రంప్ అన్నారు. తదుపరి అదే కావొచ్చని వ్యాఖ్యానించారు. మస్క్ తీరు తనను చాలా నిరాశ పరిచిందని చెప్పారు.

ఇవీ చదవండి:

పుతిన్ సాయం కోరిన పాక్.. మీ ఇన్‌ఫ్లుయెన్స్ వాడండని విజ్ఞప్తి

పౌరులకు ఏనుగుల మాంసం పంపిణీ.. జింబాబ్వే నిర్ణయం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 06 , 2025 | 12:13 AM