Israel Hamas deal: మొదటి దశ శాంతి ఒప్పందం.. సంతకం చేసిన ఇజ్రాయెల్, హమాస్
ABN, Publish Date - Oct 09 , 2025 | 07:02 AM
గాజా యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్, హమాస్‌లు ముందుకొచ్చాయని, మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆ ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేసినట్టు తెలిపారు.
గాజా యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్, హమాస్‌లు ముందుకొచ్చాయని, మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెల్లడించారు. ఆ ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేసినట్టు తెలిపారు. రెండేళ్లుగా జరుగుతున్న గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇదొక అపూర్వమైన అడుగు అని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ ద్వారా పేర్కొన్నారు (Gaza peace plan).
ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు, హమాస్ నాయకత్వం కూడా స్పందించింది (Gaza ceasefire). గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని హమాస్ నాయకత్వం అభిప్రాయపడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపింది. మరోవైపు, ఈ శాంతి ఒప్పందం ఇజ్రెయెల్‌కు ఎంతో మంచి చేస్తుందని బెంజిమన్ నెతన్యాహు అన్నారు. ఈ ఒప్పందాన్ని ఆమోదించేందుకు, బందీలను ఇళ్లకు చేర్చేందుకు ప్రభుత్వాన్ని సమావేశపరుస్తానని పేర్కొన్నారు.
'మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించినందుకు గర్వంగా ఉంది (Trump Gaza proposal). దీర్ఘకాలిక శాంతిని సాధించే క్రమంలో సైనికుల ఉపసంహరణ తొలి అడుగుగా నిలుస్తుంది. అమెరికా, అరబ్ ప్రపంచం, ముస్లిం దేశాలు, ఇజ్రాయెల్, చుట్టుపక్కల దేశాలకు ఇది చాలా మంచి రోజు. ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన ఖతార్, ఈజిప్ట్, టర్కీకు ధన్యవాదాలు' అని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 09 , 2025 | 07:02 AM