ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump ally Charlie Kirk shot: ట్రంప్‌ సన్నిహితుడు చార్లీ కిర్క్‌ హత్య

ABN, Publish Date - Sep 12 , 2025 | 03:23 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రప్‌ సన్నిహితుడు చార్లీ కిర్క్‌(31) దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం యూటా రాష్ట్రంలోని ఓ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో..

  • యూటాలోని ఓ కాలేజీలో మాట్లాడుతుండగా కాల్పులు

  • తుపాకీ హింసపై ప్రశ్నకు జవాబిస్తుండగా ఘటన

  • అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • రాజకీయ హత్యగా అభివర్ణించిన యూటా గవర్నర్‌

  • చార్లీ కిర్క్‌ గొప్ప వ్యక్తి: డొనాల్డ్‌ ట్రంప్‌

ఓరెం, సెప్టెంబరు 11: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రప్‌ సన్నిహితుడు చార్లీ కిర్క్‌(31) దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం యూటా రాష్ట్రంలోని ఓ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా దుండగుడు ఆయనను కాల్చి చంపాడు. దీంతో కార్యక్రమానికి హాజరైన జనం భయంతో పరుగులు తీశారు. కిర్క్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణం పోయినట్టు వైద్యులు తెలిపారు. ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు యూటా గవర్నర్‌ స్పెన్సర్‌ కాక్స్‌ ప్రకటించారు. రాష్ట్రానికి ఇదో చీకటి రోజని ఆయన పేర్కొన్నారు. దీనిని రాజకీయ హత్యగా అభివర్ణించారు. నిందితుడు నల్లటి దుస్తులు ధరించి, క్యాంప్‌సలోని దూరంగా ఉన్న ఓ భవనం పైకప్పు నుంచి కాల్పులు జరిపాడని అధికారులు తెలిపారు. కాగా, ‘టర్నింగ్‌ పాయింట్‌ యూఎ్‌సఏ’ అనే యువజన సంస్థకు కిర్క్‌ సహ-వ్యవస్థాపకుడు. ఆ సంఘం సీఈవో కూడా. కిర్క్‌ హత విషయాన్ని ట్రంప్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. అమెరికా యువత హృదయాలను కిర్క్‌ కంటే బాగా అర్థం చేసుకునేవారు లేరని ట్రూత్‌ సోషల్‌లో పెట్టిన పోస్టులో ట్రంప్‌ పేర్కొన్నారు. ఆయనో గొప్ప వ్యక్తి అని, లెజండరీ కూడా అని కొనియాడారు. అలాగే, కిర్క్‌ హత్యను రిపబ్లికన్లు, డెమోక్రాట్లు తీవ్రంగా ఖండించారు.

తుపాకీ సంస్కృతిపై మాట్లాడుతుండగానే..

హత్యకు సంబంధించిన వీడియోలను యూటా వ్యాలీ యూనివర్సిటీకి చెందిన కొందరు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన తెల్లటి టెంట్‌లో కిర్క్‌ కూర్చొని మాట్లాడుతుండగా ఘటన జరిగింది. టెంట్‌లో ఆయన వెనుక ‘ది అమెరికన్‌ కంబ్యాక్‌’, ‘ప్రూవ్‌ మీ రాంగ్‌’ అని రాసిన నినాదాలు కనిపిస్తున్నాయి. తూటా శబ్దం వినపడగానే కిర్క్‌ మెడలో ఎడమవైపు నుంచి రక్తం బయటికి చిమ్ముతుండగా, కిర్క్‌ తన కుడి చేతిని పైకి చూపుతూ కనిపించారు. దీంతో కార్యక్రమం లో పాల్గొన్న జనం పరుగులు తీశారు. కిర్క్‌ స్థాపించిన ‘టర్నింగ్‌ పాయింట్‌ యూఎ్‌సఏ’ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. తుపాకీ హింసపై ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు కిర్క్‌ సమాధానాలు ఇస్తుండగానే ఆయనపై కాల్పు లు జరగడం గమనార్హం. గతపదేళ్లలో ఎంతమంది ట్రాన్స్‌జెండర్‌ అమెరికన్లు మాస్‌ షూటర్లుగా ఉన్నా రో మీకు తెలుసా? అని ఒకరు ప్రశ్నించగా, ‘చాలా మంది’ అని కిర్క్‌ జవాబిచ్చారు. గత పదేళ్లలో అమెరికాలో ఎంతమంది మాస్‌ షూటర్లు ఉన్నారో మీకు తెలుసా? అని ప్రశ్నించగా, ‘ముఠా హింసను లెక్కించాలా? వద్దా? అని కిర్క్‌ అడిగారు. ఇంతలోనే కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

భారతీయులకు వ్యతిరేకంగా పోస్టు..

గతంలో భారతీయులకు వ్యతిరేకంగా కిర్క్‌ పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. భారత్‌ నుంచి వచ్చేవారికి మరిన్ని వీసాలు అవసరం లేదని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. ‘భారత్‌ నుంచి వచ్చే ప్రజలకు అమెరికా మరిన్ని వీసాలు మంజూరు చేయాల్సిన అవసరం లేదు. చట్టపరమైన వలసల కారణంగా అమెరికన్‌ వర్కర్ల స్థానంలో భారతీయులు చేరిపోయారు. ఇక చాలు. అమెరికా నిండిపోయింది. మన వాళ్లకు తొలి ప్రాధాన్యం ఇద్దాం’ అని ఈనెల 2న ‘ఎక్స్‌’లో కిర్క్‌ పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందం కొలిక్కి రావాలంటే భారత్‌కు మరిన్ని వీసాలు మంజూరు చేయాల్సి ఉంటుందని ఫ్యాక్స్‌ న్యూస్‌ వ్యాఖ్యాత పెట్టిన పోస్టుకు స్పందనగా కిర్క్‌ ఈ పోస్టు పెట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో బయటపడ్డ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్.. రూ.1000 కోట్ల దోపిడీ

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసింది.. కేటీఆర్ ఫైర్

For More TG News And Telugu News

Updated Date - Sep 12 , 2025 | 03:23 AM