AV Tech Investment Scam: హైదరాబాద్‌లో బయటపడ్డ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్.. రూ.1000 కోట్ల దోపిడీ
ABN , Publish Date - Sep 11 , 2025 | 06:03 PM
స్కాట్ మార్కెట్‌లో పెట్టుబడులపై భారీ లాభాల ఆశ చూపిన ఓ హైదరాబాదీ సంస్థ ఏకంగా రూ.1000 కోట్ల మేర దోచేసింది. రెండు రాష్ట్రాల్లో సుమారు 4,500 మందికి ఈ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది.
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో తాజాగా భారీ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల (Stock Market Investment fraud)పై లాభాల ఆశ చూపిన ఏవీ టెక్నాలజీస్ అనే సంస్థ ప్రజల నుంచి ఏకంగా రూ.1000 కోట్లు తీసుకున్నట్టు బయటపడింది. ఏవీ టెక్నాలజీస్, ఐఐటీ టెక్నాలజీస్, ఏవీ రియల్టీ పేరుతో నిర్వాహకులు మోసాలకు తెరతీశారు. భారీగా డబ్బు దండుకున్నారు.
తమ కంపెనీల ద్వారా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని ఉచ్చులోకి దింపి అమాయకులను మోసం (Hyderabad AV Technologies scam) చేశారు. పెట్టుబడులపై ఆరు శాతం వడ్డీ వస్తుందని నమ్మకంగా చెప్పి నట్టేట ముంచేశారు. రెండు రాష్ట్రాల్లోనూ సుమారు 4,500మంది ఈ సంస్థ బారిన పడి సొమ్ము పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసింది.. కేటీఆర్ ఫైర్
హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
For More TG News And Telugu News