CM Revanth Review ON Railway Projects: హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
ABN , Publish Date - Sep 11 , 2025 | 09:21 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు.
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఇవాళ(గురువారం) ఉదయం 11 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మొదట మూడు ప్రతిపాదిత హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టులపైన సమీక్ష చేయనున్నారు సీఎం. తెలంగాణ మీదుగా మూడు హైస్పీడ్ రైలు మార్గాలకు ప్రణాళికపై అధికారులతో మాట్లాడనున్నారు.
హైదరాబాద్ – చెన్నై, హైదరాబాద్ – బెంగళూరు మార్గాలకు ప్రభుత్వం ఇప్పటికే అలైన్‌మెంట్లు ఖరారు చేసింది. ఇంకా ప్రతిపాదన దశలోనే హైదరాబాద్ – అమరావతి హైస్పీడ్ రైలు (Hyderabad Amaravati High Speed Rail) మార్గం ఉంది. ఈ అలైన్ మెంట్‌పై కూడా అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు. ఈ సమీక్షలో రైల్వే ముఖ్య ఇంజనీర్లు, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు. వికారాబాద్ – కృష్ణా, డోర్నకల్ – గద్వాల, కల్వకుర్తి – మాచర్ల మార్గాలపై కూడా మాట్లాడనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
అలాగే, రీజనల్ రింగ్ రైల్వే ప్రాజెక్టుపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రీజినల్ రోడ్డుకు సమాంతరంగా రైలు అలైన్‌మెంట్ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. గ్రూప్-1పై (Group 1) సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడంపై సమీక్ష చేసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలనే ఆలోచనలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. ఈ విషయంపై కూడా సీఎం రేవంత్‌రెడ్డి చర్చించే అవకాశాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజీనామా చేసి.. పోటీ చేద్దాం.. గెలుపెవరిదో చూద్దాం
For More TG News And Telugu News