Venkaiah Naidu: సంస్కారం లేని విద్య.. దండగ కుటుంబ వ్యవస్థను రక్షించుకోవాలి
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:56 AM
సంస్కారం లేని విద్య పరమ దండగ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు...
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
కవాడిగూడ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : సంస్కారం లేని విద్య పరమ దండగ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులతోపాటు గురువులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠంలో ఉన్న స్వామి వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ ఎక్స్‌లెన్సీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావర ణాన్ని కాపాడినప్పుడే అది మనల్ని కాపాడుతుందన్నారు. స్వామి వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ ఎక్స్‌లెన్సీ ఆధ్వర్యంలో 25 ఏళ్లుగా వేలాదిమందిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. స్వామి వివేకానంద ఆశయ సాధన కోసం నేటి యువత పాటుపడాలని, సన్మార్గంలో పయనించాలని సూచించారు. పాశ్చాత్య వ్యామోహాలకు లోనుకాకుండా స్వదేశీ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని కోరారు. రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద స్వామి, నిత్యంకుంట నందాజీ తదితరుల పాల్గొన్నారు.