Share News

KTR Criticizes Congress: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసింది.. కేటీఆర్ ఫైర్

ABN , Publish Date - Sep 11 , 2025 | 11:48 AM

రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసిందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR Criticizes Congress: కాంగ్రెస్  ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసింది.. కేటీఆర్ ఫైర్
KTR Criticizes Congress

హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై (Revanth Reddy Govt) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్కారు కొలువు కోసం ఏళ్ల తరబడి కష్టపడి తమ విలువైన సమయాన్ని... అమ్మా, నాన్నల కష్టార్జితాన్ని ధారపోసి పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని ఈ కాంగ్రెస్ సర్కార్ వమ్ముజేసిందని ధ్వజమెత్తారు మాజీమంత్రి కేటీఆర్.


అసమర్థత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవకతవకలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని మండిపడ్డారు. అంగట్లో కొలువులు అమ్ముకొని ఈ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసిందని ఆక్షేపించారు. గ్రూప్- 1 పరీక్ష (Group - 1 Exam) నిర్వహణలో ఫెయిలైన రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని హెచ్చరించారు.


తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశించినట్లుగా గ్రూప్ -1 పరీక్ష మళ్లీ తాజాగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రూప్ -1 పరీక్షలో అవకతవకలపై జ్యుడీషియల్ కమిషన్ వేయాలని సూచించారు. గ్రూప్ -1 పరీక్షలో అసలు దొంగలెవరో తేల్చాలని కోరారు. ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసపూరిత వాగ్ధానంపై ప్రత్యేకంగా అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

బోధన్‌లో ఐఎస్‌ లింకులు

For More TG News And Telugu News

Updated Date - Sep 11 , 2025 | 12:04 PM