Food Safety Officials Raid: ప్రముఖ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:48 AM
హైదరాబాద్‌లో ప్రముఖ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయితే, ఈ దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్: సిటీలో పలు ప్రముఖ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. అబ్సల్యూట్ బార్బిక్ క్యూ ఔట్లెట్స్ లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బంజారాహిల్స్, గచ్చిబౌలి ఔట్‌లెట్స్‌లోని కిచెన్స్, స్టోర్ రూమ్స్‌లలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు. కిచెన్ పరిసరాలు బొద్దింకలు, ఈగలతో అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇనార్బిట్ మాల్‌లో ఉన్న అబ్సల్యూట్ బార్బిక్ లో కుళ్ళిపోయిన ఫ్రూట్స్ ను సర్వ్ చేస్తున్నట్లు బహిర్గతం చేశారు. మేడిపల్లి ఔట్ లేట్‌లో ఎక్స్పైర్ అయిన ఫుడ్‌ను మళ్లీ వేడి చేసి వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. ఏ.ఎస్.రావు నగర్ ఔట్ లెట్ లోని స్టోర్ రూమ్‌లో ఎలుకలు తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయని పేర్కొన్నారు. నిర్వహకులు ఫ్లోర్ పైనే ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేస్తున్నట్లు అధికారులు సంచలన విషయాలు తెలిపారు.
అబ్సల్యూట్ బార్బిక్ క్యూ ఔట్‌లెట్లు శుభ్రత, నాణ్యత పరంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో అబ్సల్యూట్ బార్బిక్ నిర్వాహకులకు అధికారులు నోటీసులిచ్చారు. శాంపిల్స్ సేకరించి టెస్ట్‌ల కోసం ల్యాబ్‌కి పంపించారు. రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Also Read:
ఏపీలో 11 మంది ఐఎఫ్‌ఎస్‌ల బదిలీలు..
సీజనల్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టే 6 పౌష్టిక ఆహారాలు ఇవే.!
For More latest News