Indian Forest Service: ఏపీలో 11 మంది ఐఎఫ్‌ఎస్‌ల బదిలీలు..
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:35 AM
ఏపీలో 11 మంది ఐఎఫ్‌ఎస్ (Indian Forest Service) అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారు. అలాగే..
ఏపీలో 11 మంది ఐఎఫ్‌ఎస్ (Indian Forest Service) అధికారుల బదిలీలు జరిగాయి.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారు. అలాగే మిగతా అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.
అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఎస్.ఎస్.శ్రీధర్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా శర్వణన్, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజనల్ మేనేజర్‌గా శ్రీకాంతనాథరెడ్డి, శ్రీశైలం ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్‌గా విజయ్‌కుమార్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కర్నూలు సర్కిల్‌గా బీవీఏ కృష్ణమూర్తి, సిల్వి కల్చరిస్ట్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అధికారిణిగా బబిత, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారిగా జీజీ నరేంద్రన్, తిరుపతి డీఎఫ్‌వోగా వి.సాయిబాబా, ఆత్మకూరు అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా విఘ్నేష్‌అప్పావో, నెల్లూరు అభివృద్ధి కార్పొరేషన్ రీజనల్ మేనేజర్‌గా పి.వివేక్ నియమితులయ్యారు.
Also Read:
నిమ్స్ కిటకిట.. 3 రోజుల్లో 11,590 మంది రోగుల రాక
జనసేన ఎంపీకి బిగ్ షాక్.. సైబర్ నేరగాళ్లు 92 లక్షలు స్వాహా
For More Latest News